టీ20 ప్రపంచ కప్ తర్వాత బంగ్లాదేశ్ తో టీమిండియా తలపడబోతోంది. ఈ సిరీస్ లో మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచులు జరగనున్నాయి. బంగ్లాదేశ్ లోని ఢాకాలో ఈ సిరీస్ జరగనుంది. ఇదిలా ఉంటే నేడు టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య తొల వన్డే మ్యాచ్ మొదలైంది. మ్యాచ్ లో భాగంగా మొదట టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు ఫీల్డింగ్ తీసుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్ చేపట్టింది.
టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య జరిగే ఈ వన్డే సిరీస్ ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియాకు చేదు వార్త తెలిసింది. స్టార్ పేసర్ అయిన మహమ్మద్ షమీ చేతికి గాయం కావడంతో మూడు వన్డీ సిరీస్ ల నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని క్రికెట్ అకాడెమీ తెలియజేసింది.
ఆదివారం జరుగుతున్న వన్డే మ్యాచ్ లో మొదట టీమిండియా బ్యాటింగ్ చేపట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. బంగ్లా బౌలర్లు వేసే బంతులను ఎదుర్కొంటూ మంచి స్కోర్ దిశగా సాగారు. అయితే 23 పరుగుల వద్ద ఓపెనర్ శిఖర్ ధావన్ అనూహ్యంగా ఔట్ అయ్యాడు. బంగ్లా బౌలర్ హసన్ మిరాజ్ వేసిన బంతికి ఔటయ్యాడు.
శిఖర్ ధావన్ 17 బంతుల్లో 7 పరుగులే చేయగలిగాడు. బంగ్లాతో వన్డే సిరీస్ కు భారత టీమ్ తుది జట్టు కూర్పులో కొన్ని మార్పులు చేసింది. ఈ సిరీస్ కు రిషబ్ పంత్ కు విశ్రాంతినిచ్చి పక్కనబెట్టింది. అయితే టెస్టు మ్యాచులకు మాత్రం రిషబ్ పంత్ ఉంటాడని తెలియజేసింది. వన్డేలకు మాత్రం రిషబ్ పంత్ స్థానంలో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా ఉంటాడని తెలిపింది. ఇకపోతే ఈ మ్యాచ్ ద్వారా కుల్దీప్ సేన్ వన్డేల్లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం.