Health ఒక మనిషి కళ్ళను చూసి అతని ఆరోగ్యం ఏ స్థితిలో ఉందో అంచనా వేయొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు కళ్ళ చుట్టూ ఉండే నల్లని వలయాలు.. కంటిలో నల్లని గుడ్డు చుట్టూ జరిగే మార్పులను బట్టి అతని ఆరోగ్యం పరిస్థితిని కచ్చితంగా చెప్పవచ్చని చెబుతున్నారు..
కళ్ళు ఎలా ఉన్నాయి అనేదాన్ని బట్టి ఆ మనిషి పూర్తి ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చని తాజా అధ్యయనాల్లో తెలుస్తోంది.. కనుపాప వెలుతురుకు తక్షణమే స్పందిస్తూ ఉంటుంది వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు సూటిగా చూడటానికి కొంచెం ఇబ్బంది పడుతుంది వెలుతురు తగ్గుతున్న సమయంలో కనుపాప పెద్దదిగా అవుతుంది. అయితే ఈ మార్పులు వెంటవెంటనే జరగాలి అలా కాకుండా కనుపాప పెద్దది అవటానికి చిన్నది కావడానికి చాలా సమయం పడుతూ ఉందంటే దీర్ఘకాలంగా వేధించే ఎన్నో సమస్యలు రాబోతున్నాయని అంచనా వేయవచ్చు అని తెలుస్తోంది అలాగే మద్యపానం తీసుకునే వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తూ ఉంటుందని తెలుస్తోంది..
అలాగే కళ్ళు ఒక్కసారిగా పసుపు రంగులోకి మారిపోతే లివర్కు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవాలి అలాగే కళ్ళు ఎర్ర రంగులోకి మారితే ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయేమో లేదా కాలుష్యం కారణంతో అలా అవుతుందో డాక్టర్ని సంప్రదించి తెలుసుకోవాలి.. అలాగే మన కంటిలో నల్ల గుడ్డు చుట్టూ తెల్లని లేదా ఇంకా ఏదైనా రంగులో ఒక వలయం ఏర్పడితే శరీరంలో కొవ్వు శాతం అధికంగా ఉందని సంకేతం.. అందుకే ఇలాంటి సమస్యలను ఎప్పటికప్పుడు సరి చూసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు..