Bhakthi ఆ ఏడుకొండల వాడిని దర్శించడం దర్శించుకోవడానికి వేలాది భక్తులు తరలివస్తున్నారు ఈ పరిస్థితుల్లో తిరుమలలో ఉండేందుకు వసతి గదులు దొరకటం లేదంటూ భక్తుల నుంచి ఎన్నో ఫిర్యాదులు ఎదురవుతున్నాయి ఈ విషయంపై స్పందించిన టిటిడి ఈవో ధర్మారెడ్డి డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు..
తిరుమల తిరుపతి లో ఉండటానికి వసతి గదులు దొరకలేదంటు చాలా మంది భక్తులు ఫిర్యాదు చేశారని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అయితే తిరుమలలో ప్రస్తుతం ఉన్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, అడ్వాన్స్‌డ్ దర్శన టికెట్లు, బ్రేక్ దర్శన టికెట్లు పొందిన భక్తులు తిరుపతిలో బసచేసి స్వామివారి దర్శనానికి రావాలని ధర్మారెడ్డి సూచించారు.
తిరుమలలో తమకు ఉండటానికి వసతి గదులు దొరకటం లేదంటూ భక్తులు చేసిన ఫిర్యాదులపై స్పందించిన టిటిడి ఆదివారం ఉదయం తిరుమల అన్నమయ్య భవన్‌లో డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 28 మంది భక్తులు తమకు ఎదురైన సమస్యలను ఈవో దృష్టికి తీసుకొచ్చారు. అలాగే తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు వ్యవస్థను తిరుపతిలో చేపట్టాలని నిర్ణయించామన్నారు. త్వరలోనే ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని మొదలు పెడతామని వెల్లడించారు. అలాగే శ్రీవారి దర్శనార్థం కంపార్ట్‌మెంట్లలో రాత్రి వేళ నుంచి వేచి ఉండే సామాన్య భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు వీలుగా ఉదయం ఉన్న వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 10 గంటలకు మార్పు చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు..