emedy For Throat Pain And Infections: కరోనా వైరస్ సమస్య ఇంకా తొలగిపోలేదు. అందులోనూ చలికాలంలో దగ్గు, జలుబు, గొంతునొప్పి లాంటి అనారోగ్య సమస్యల బారిన పడటం సర్వసాధారణం. కరోనా లక్షణాలలో గొంతు నొప్పి(Throat Pain) కూడా ఒకటి. కరోనా టీకాలు ప్రారంభయ్యాయి కనుక మరికొన్ని రోజులు చాలా జాగ్రత్తలు పాటించాలి.
రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం మాత్రం ఆపవద్దు. అయితే గొంతు నొప్పి వస్తే కంగారు పడాల్సిన పనిలేదు. నొప్పి తీవ్రతరం అయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. గొంతు నొప్పి(Throat Pain)కి మీరు ఇంట్లోనే సులభంగా మెడిసిన్ తయారు చేసుకోవచ్చు. నీరు, అల్లం(Ginger), తేనె లాంటి పదార్థాలు ఉంటే చాలు. అల్లం, తేనెను ఆయుర్వేదం(Ayurvedam)లో ఔషధాలలో వినియోగిస్తారు. ఈ పదార్థాలతో గొంతు నొప్పిని మటుమాయం చేసే కషాయాన్ని తయారు చేసుకుని సేవిస్తే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.