Bhakthi సూర్యగ్రహణం చంద్రగ్రహణం గ్రహణం ఏదైనా ఆలయాలు మూసివేస్తుంటారని మనకు తెలుసు.. అయితే ఈ సమయంలో కూడా మన దేశంలో కొన్ని ఆలయాలను తెరిచే ఉంచుతారు అంతే కాకుండా అక్కడ ప్రత్యేకంగా కొన్ని పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు అయితే ఆ దేవాలయాలు ఏంటి ఎక్కడున్నాయి అనే విషయం తెలుసుకుందాం..
గ్రహణం ఎలా ఆలయాల్ని మూసివేస్తూ ఉంటారు దీని వెనక ఉన్న కారణం ఏంటంటే గ్రహణం వేల ఆలయ తలుపులు తెరిచి ఉంచటం వల్ల గ్రహణ ప్రభావం ఆలయ విగ్రహాలపై పడుతుందని దీంతో ఆ విగ్రహాలు తమ శక్తిని కోల్పోతాయని పురాణాలు వివరిస్తున్నాయి.. అందుకే ఎలాంటి ఆలయాలు అయినా ఈ సమయంలో మూసివేస్తూ ఉంటారు..
అయితే ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయంలో మాత్రం గ్రహణం సమయంలో ఆలయ తలుపులు తెరిచే ఉంటాయి.. దేశంలో ఉన్న పంచలింగ క్షేత్రాల్లో ఒకటిగా కొలువైయున్న శ్రీకాళహస్తిని గ్రహణం వేల తెలిసి ఉంచడమే కాకుండా ఈ సమయంలో అక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు.. అంతేకాదు రాహువు, కేతువులను పూజించే ఏకైక దేవాలయం కూడా ఇదే కావడం మరో విశేషం. ఎవరి జాతకంలో అయితే కాలసర్ప దోషంతో బాధపడుతుంటారో.. వాటి పరిహారం కోసం ప్రత్యేక పూజలు చేస్తారు.. రాయలసీమలోని కర్నూలు జిల్లాలోని సంగమేశ్వర ఆలయం కూడా గ్రహణం వేళ తెరిచే ఉంటుంది. వర్షా కాలంలో పూర్తిగా మునిగి ఉండే ఈ ఆలయంలో కేవలం ఎండాకాలంలో మాత్రమే పూజలు నిర్వహిస్తారు అంతేకాకుండా ఇక్కడ సూర్యగ్రహణం సమయంలో అరుణ హోమం కూడా నిర్వహిస్తారు.. అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో కూడా గ్రహణం సందర్భంలో తలుపులను తెరిచే ఉంచుతారు.