Bhakthi దీపావళి చీకట్లను దూరం చేస్తూ అందరూ దివ్వెలని వెలిగించి ఎంతో ఆనందంగా జరుపుకునే దీపావళి ముఖ్యంగా లక్ష్మీదేవి పండగగానే చెప్పుకోవచ్చు అయితే ఈ పండగకి కచ్చితంగా ఇంట్లో పాటించాల్సిన కొన్ని నియమాలు ఉంటాయని చెబుతున్నాయి శాస్త్రాలు అవేంటో తెలుసుకుందాం..
దీపావళి అంటేనే లక్ష్మీదేవిని పూజిస్తారు ఆమెను ఇంటిలోకి సాదరంగా ఆహ్వానిస్తూ చేసే ఈ పండుగ విషయంలో ఎలాంటి అజాగ్రత్త చేయకూడదని పెద్దలు చెబుతున్నారు ఇందులో ముఖ్యంగా దీపావళికి ముందు ఇంటిని శుభ్రం చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని తెలుస్తోంది అలాగే కొన్ని వస్తువులను దీపావళికి ముందే ఇంటిలో నుంచి బయట పడేయాలని చెబుతున్నారు.. అందులో ముఖ్యంగా విరిగిన పగిలిపోయిన వస్తువుల్ని ఇంటిలో ఉంచరాదని తెలుస్తోంది ముఖ్యంగా విరిగిపోయిన కుర్చీలు పగిలిపోయిన ప్లేట్లు వంటి వాటిని ఇంటిలోంచి బయటపడేయటమే ఉత్తమమని చెబుతున్నారు.. అలాగే గాజు పింగాణి వంటి కొన్ని పాత్రలు సగం పగిలి మిగిలిన వాడుకోవడానికి పనికొస్తు ఉంటాయి ఇలాంటి వాటిని కూడా ఇంట్లో ఉంచకపోవడం మంచిదని చెబుతున్నారు ఇవి ఇంటిలో ఉండటం వల్ల చెడు ప్రభావం కలిగే అవకాశం ఉంటుందని తెలుస్తోంది..
అలాగే కొన్ని దేవుడు చిత్రాలు విగ్రహాలు విరిగిపోయి చిరిగిపోయి ఉంటే వాటిని వెంటనే దగ్గరలో ఉన్న ఏదైనా బావిలో కానీ చెరువులో కానీ పడేయడం మంచిది. వీటిని ఇంట్లో ఉంచుకోవడం ఏమాత్రం మంచిది కాదు అలాగే ఆగిపోయిన గడియారాల్ని ఇంట్లో ఉంచుకోకూడదు ఇలా చేయడం వల్ల ఆ శుభం కలుగుతుందని నమ్మకం.. అలాగే పగిలిపోయిన గాజులు చిరిగిపోయిన పాత చెప్పులు వాటి అన్నిటిని బయటపడేసి ఇంటిని శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవిని ఇంటిలోకి సాదరంగా ఆహ్వానించాలని పెద్దలు చెబుతున్నారు..