Health కొన్ని రకాల ఆహార పదార్థాలను వండిన తర్వాత చాలా సమయం అయ్యింది కదా అంటూ వేడి చేస్తూ ఉంటారు అయితే దీనివల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుస్తోంది..
కొన్ని రకాల ఆహార పదార్థాలను ఒక్కసారి మాత్రమే వండాలి మరొకసారి వీటిని వేడి చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరావు ఇలా చేయడం వల్ల వాటిలో ఉండే పోషకాలు నశించడమే కాకుండా అవి శరీరానికి విషం గా మారుతాయి అని తెలుస్తోంది..
అందులో ముఖ్యంగా ఆలుగడ్డలు ఆలుగడ్డలు వండిన ఫ్రై చేసిన రెండోసారి మాత్రం దీన్ని వేడి చేయకూడదు ఇలా చేయడం వల్ల దీర్ఘకాలంగా ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుస్తోంది అలాగే అన్నాన్ని ఒకసారి వండిన తర్వాత మళ్లీ వేడి చేయకూడదు అలాగే మాంసాహార సంబంధిత పదార్థాలను కూడా ఒక్కసారి వండిన తర్వాత మరొకసారి వేడి చేయవలసిన అవసరం లేదు అందులో ముఖ్యంగా చికెన్ విషయంలో ఇది పాటించి తీరాలి అయితే కొన్నిసార్లు ఫ్రిజ్లో పెడుతూ ఉంచుతారు ఇలా చేయడం కూడా ఎక్కువ రోజులు ఉంచడం అసలు మంచిది కాదు అయితే మరీ చల్లగా ఉండి కూరలు ఫ్రెష్ గా ఉన్నాయి అనుకున్న సమయంలో మాత్రం కొన్ని సందర్భాల్లో తక్కువ మొత్తంలో వేడి చేయొచ్చు.. అలాగే ఏ రకం ఆహార పదార్థాలు అయినా వండిన వెంటనే తీసుకోవడం మంచిది. వీటిని ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్ లోను బయట ఉంచుతూ నిల్వ ఉన్న తర్వాత వేడి చేసి ఆహారంగా తినటం వల్ల ఎప్పటికైనా ప్రమాదమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు..