FILM NEWS : యంగ్ ట్యాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పాంచ్ మినార్’. గోవింద రాజు ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ LLP బ్యానర్ పై మాధవి, MSM రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ మిడిల్ క్లాస్ ఆంథమ్ ‘ఏం బతుకురా నాది’ సాంగ్ వైరల్ అయ్యింది. ఈ రోజు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మారుతి టీజర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. పాంచ్ మినార్ టైటిల్ చాలా బాగుంది. గోవిందరాజు గారు చాలా పాషన్ ఉన్న వ్యక్తి. ఎలాగైనా సాధించాలి నిలబడాలనే కసి పట్టుదలతో ఈ సినిమాని తీశారు. కెమెరా వర్క్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. సినిమాని చాలా రిచ్ గా తీశారు. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. డెఫినెట్ గా ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని నమ్మకం ఉంది. ఈ సినిమాతో రాజ్ తరుణ్ కి కూడా బెస్ట్ స్టార్ట్ అవుతుందని నమ్ముతున్నాను.
టీజర్ చూడగానే సినిమా హిట్ అవుతుందని నమ్మకం కలిగింది. మంచి సినిమా. డెఫినెట్ గా ఎంకరేజ్ చేయాలని ఈ వేడుకకు రావడం జరిగింది. ప్రోడక్ట్ చాలా ప్రామిసింగ్ గా క్వాలిటీ గా ఉంది. చిన్న బడ్జెట్ లో క్వాలిటీ ప్రోడక్ట్ తీయడం అంత ఈజీ కాదు. చాలా కష్టపడాలి. అలాంటి కష్టం ఈ సినిమాకి పడ్డారు. ఇలాంటి మంచి సినిమాలు ఎంకరేజ్ చేయండి. గోవిందరాజు గారు అండ్ టీం ని బ్లెస్ చేయండి. అందరికీ థాంక్యూ సో మచ్’అన్నారు.
నటీనటులు : రాజ్ తరుణ్, రాశి సింగ్,అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ ప్రసన్న, రవి వర్మ, సుదర్శన్, కృష్ణ తేజ, నంద గోపాల్, ఎడ్విన్ లక్ష్మణ్ మీసాల, జీవా, అజీజ్ తదితరలు.
సాంకేతిక సిబ్బంది :
బ్యానర్: కనెక్ట్ మూవీస్ LLP
సమర్పణ: గోవింద రాజు
రచన & దర్శకత్వం: రామ్ కడుముల
నిర్మాతలు: మాధవి, MSM రెడ్డి
సంగీతం: శేఖర్ చంద్ర
డీవోపీ: ఆదిత్య జవ్వాది
ఎడిటర్: ప్రవీణ్ పూడి
ఆర్ట్ డైరెక్టర్: ‘బేబీ’ సురేష్ భీమగాని
డైలాగ్స్: గొరిజాల సుధాకర్
కో-డైరెక్టర్స్: పుల్లారావు కొప్పినీడి & టి రాజా రమేష్
పీఆర్వో: వంశీ శేఖర్