FILM NEWS : హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ రాబిన్‌హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రెండు పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈరోజు, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థర్డ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
“ది హాటెస్ట్ సర్ప్రైజ్ ఆఫ్ ది ఇయర్” గా సిజ్లింగ్ దివా కేతికా శర్మ నటించిన స్పెషల్ సాంగ్ మార్చి 10న విడుదల కానుంది. ఈ ట్రాక్ లో కేతికా శర్మ అల్ట్రా గ్లామరస్ గా కనిపించనుంది. ఇది ప్రేక్షకులను, సంగీత ప్రియులను సర్ ప్రైజ్ చేయబోతోంది.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కేతిక శర్మ గ్లామరస్ లుక్ ఆకట్టుకుంది. బోల్డ్, స్టన్నింగ్ పెర్ఫామెన్స్ లతో ఆకట్టుకునే కేతిక శర్మ ఈ సాంగ్ లో అదరగొట్టబోతోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ బ్యుటీఫుల్ సినిమాటోగ్రఫీని అందించారు. కోటి ఎడిటర్‌గా పనిచేస్తుండగా, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.
తారాగణం : నితిన్, శ్రీలీల, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్
సాంకేతిక సిబ్బంది :
రచన, దర్శకత్వం: వెంకీ కుడుముల
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
CEO: చెర్రీ
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
DOP: సాయి శ్రీరామ్
ఎడిటర్: కోటి
ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి తుమ్మల
లైన్ ప్రొడ్యూసర్: కిరణ్ బళ్లపల్లి
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, రవివర్మ, విక్రమ్ మోర్
పబ్లిసిటీ డిజైనర్: గోపి ప్రసన్న
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో