మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో పెటాలింగ్ స్ట్రీట్ లో బుధవారం (26.07.2023) జగిత్యాల రూరల్ మండలం కల్లెడకు చెందిన ఎన్నారై గాజెంగి రంజిత్ నలబై మంది పేదలకు అన్నదానం చేశారు. మలేసియా పర్యటనలో ఉన్న వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి గౌరవార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మహబూబ్నగర్ కు చెందిన యువ నాయకుడు పూసులూరి కాంతికిరణ్ భార్గవ్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంద భీంరెడ్డి మాట్లాడుతూ… సాఫ్ట్ వేర్ ఉద్యోగి గాజెంగి రంజిత్ మలేషియాలో మన కార్మికులకు అవసరమైన సహాయం అందించడం, సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. కార్మికులకు ఉపయోగపడే వలస కార్మిక నిబంధనల పుస్తకాలను, ప్రచార సామగ్రిని రంజిత్ కు బహుకరించారు.