నవతరానికి నాయకురాలిగా, యువతరానికి ఆదర్శప్రాయురాలిగా, భర్తకు తగ్గ భార్యగా రాజకీయాల్లో సరికొత్త ఒరవడి సృష్టిస్తున్నారు పట్నం సునీత మహేందర్ రెడ్డి. ఆపదలో వున్న వారికి నేనున్నానే భరోసా కల్పిస్తున్నారామె. జడ్పీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచి ఏసీ గదుల్లో , కార్యాలయానికే పరిమితం కాకుండా సబ్బండ వర్గాల సమస్యలపై సునీత దృష్టి పెట్టారు.
మారుమూల ప్రాంతాలలోని సామాన్యులతో కలియతిరుగుతూ, వారి కుటుంబంలో మనిషిలా వారికి తలలో నాలుకలా వుంటున్నారు. ఏం జరిగినా మా సునీతమ్మ వుందన్న భరోసాను ఆమె కల్పిస్తున్నారు. ఈ రోజు సునీత మహేందర్ రెడ్డి పుట్టినరోజు. ఆమె ఇలాంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాం.