Political తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు తనతోపాటు ఇంకా అందరూ రాజకీయ నాయకులు పాత్రికేయులు ఉన్నత స్థానాల్లో ఉన్న చాలామంది ఫోన్లలో పెగాసస్ నిగా వేస్తుందని ఆరోపించారు..
తెలంగాణ ఐటి మంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు..శుక్రవారం ఆయన ప్రగతి భవన్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.. తనతో పాటు ఉన్నత స్థానంలో ఉన్న వారితో కలిపి దాదాపు పదివేల మందిపై పెగాసెస్ కొనసాగుతుందని అన్నారు.. తన ఫోన్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ పై కూడా ప్రధాన పర్యవేక్షణలో పెగాసిస్నిగా కొనసాగుతుందని అన్నారు దేశంలో ఉన్నత స్థానంలో ఉన్న ఎంతోమంది ఫోన్లో పెగాసస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఫోన్ టాపింగ్ జరుగుతుందని ఆరోపించారు.. నిస్సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి ఈ విషయం తెలియక పోవచ్చని వ్యాఖ్యానించారు. . కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తమ కార్యాలయంలోకి ఇంటిలిజెన్స్ సీఐని ఎలా పంపిస్తారని ప్రశ్నించగా కేటీఆర్ ఈ పెగాసస్ ప్రస్తావన చేశారు.
అంతేకాకుండా ఒకప్పుడు ఎన్నో ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు దేశానికి గుదిబండలా మారిందని, ఉనికికోసం తాపత్రయపడే స్థాయికి చేరుకుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అలాగే కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర వదిలి కాంగ్రెస్ జోడో యాత్రను చేపట్టాలని సూచించారు. ఈ యాత్ర తెలంగాణలోకి చేరేసరికి ఆ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒకరిద్దరు ఎంపీలు కూడా పార్టీ మారనున్నారని తెలిపారు. అయితే ఆ పార్టీ మారాలనుకుంటున్న ఎంపీలు ఎవరనేది తాను చెప్పబోనని కానీ ఆ విషయంపై తనకు కావలసినంత క్లారిటీ ఉందని అన్నారు కేటీఆర్..