politics తెలంగాణ రాజకీయాల్లో రోజురోజుకీ తీవ్రదుమారం చెల్లరేగుతుంది.. తాజాగా కాంగ్రెస్ స్ట్రాటజీ టీం హెడ్ ఆఫీస్ ను ఫీజ్ చేయడం పై తెలంగాణ కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది.. ఈ నేపథ్యంలో నాంపల్లిలోని గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది..
తెలంగాణాలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఇప్పటికే జరుగుతున్న పరిణామాలతో పాటు మరో దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే.. కాంగ్రెస్ స్ట్రాటజీ టీమ్ హెడ్ ఆఫీస్ను సీజ్ చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తోంది. వార్రూమ్లో డేటాను ధ్వంసం చేశారని కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. పలుచోట్ల కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నాంపల్లి గాంధీభవన్ వద్ద తీవ్ర ఉద్రేక్తత కదా నెలకొన్న నేపథ్యంలో.. ప్రస్తుతం గాంధీభవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
అలాగే తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఎప్పటికప్పుడు వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే సీనియర్ నాయకులు అందరూ ప్రస్తుతం అసంతృప్తి ఉన్నారు అలాగే అసలు కాంగ్రెస్ నేపథ్యం తెలియని వారందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారంటూ సీనియర్లకు విలువ లేకుండా పోతుంది అంటూ ఇప్పటికే పలువురు నాయకులు మీడియా సమావేశంలో ప్రత్యక్షంగా అసహనం వ్యక్తం చేశారు..భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి ప్రస్తుతం పార్టీ వేసిన కమిటీల్లో చోటు దక్కలేదు. దీంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ తన అసహనాన్ని వ్యక్తం చేశారు.