Telangana Youth Powerful Comments on Etela Rajender, Huzurabad Political News, Telangana News, Huzurabad by Elections, Telangana Vijay Telugu World Now,
Telangana Political News: ఎవరు మూర్ఖులు ఈటెల ? ఈటెలకు యువకుడి స్ట్రాంగ్ కౌంటర్..
*పదవి పోయిందనే ప్రస్టేషన్ లో,గెలవలేననే ప్రస్టేషన్ లో,ఎన్నికలు వాయిదా పడ్డాయనే ప్రస్టేషన్ లో ప్రజల మనిషి మంత్రి హరీశ్ రావు గారిపై పిచ్చి కూతలు కూస్తున్న ఈటెలా..నా ప్రశ్నలకు సమాదానం చెప్తావా..?
ఎవరు మూర్ఖులు ఈటెల..?
* పేద ప్రజల భూములు లాక్కొని వారి పొట్టగొట్టిన నువ్వు మూర్కుడవై.. పేద ప్రజల కోసం నిత్యం సేవ చేస్తున్న హరీశ్ రావును అంటున్నావా..?
* నియోజకవర్గంలో నమస్తే పెడితే కూడా తిరిగి ప్రతి నమస్కరించని నువ్వు మూర్ఖుడవయ్యుండి..ఆపదస్తే అరనిమిషంలో స్పందించే హరీశ్ గారిని అంటున్నావా..?
* 4వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తే కట్టకుండా నీ ఇండ్లు మాత్రం బ్రహ్మాండంగా కట్టుకున్న నువ్వు మూర్ఖుడవయ్యుండి..పేదలకు ఇండ్లు కట్టించి ఆ ఇండ్లలోకి చేర్చిన హరీశ్ రావును అంటున్నావా..?
* పదవి కోసం,కుర్చీ కోసం పార్టీని చీల్చ చూసిన నువ్వు మూర్కుడవయ్యుండి..పదవున్నా లేకున్నా పార్టీకి నిత్యం విజయాలందిస్తున్న క్రమశిక్షణ కలిగిన నాయకుడు హరీశ్ రావును పట్టుకుని మూర్ఖుడు అని సంబోదిస్తున్నావా..?
* అన్నం పెట్టిన కేసీఆర్ నీకు పదవులిచ్చి గొప్ప స్థాయికి తీసుకొస్తే, సోయి మరిచి ఆ నేతనే రా అంటూ సంబోందిస్తూ మాటలు తూలనాడుతున్న నువ్వు మూర్కుడవయ్యుండి.పదవుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసే నాయకున్ని పిచ్చి కూతలు కూస్తున్నావా..?
* ఆత్మగౌరవం అని చెప్పి ఆత్మవంచన చేసుకుని తెలంగాణాకు అన్యాయం చేస్తున్న బీజేపీలో చేరిన మూర్ఖుడవు నువ్వు..అలాంటిది ఉద్యమం నుండి నేటి వరకు పార్టీ కోసం,ప్రజల కోసం పదవున్నా లేకున్నా నిత్యం కృషి చేసిన హరీశ్ రావును పట్టుకుని పిచ్చుకూతలు కూస్తున్నావు..
* ప్రత్యర్థులతో చేతులు కలిపి,ఇంటి రహస్యాలను వారికి చేరవేస్తూ విచ్చిన్న శక్తులతో జతకట్టి తెలంగాణా ను విశ్చిన్నం చేయాలని చూసిన నువ్వు మూర్కుడవయ్యుండి..తెలంగాణా ప్రజల కోసం,రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో విజయాలనందిస్తూ,కష్టాలను తీర్చుతూ ముందుకు సాగిన మహానేత హరీశ్ రావుని విమర్శిస్తున్నావా..?
* అర్థరాత్రి దొంగలా ఒక్కడివే వ్యక్తిగత సిబ్బందిని వదిలిపెట్టి దొంగచాటుగా వెల్లి ప్రత్యర్థులతో చేతులు కలిపిన నువ్వు. అర్థరాత్రి ఆపదచ్చినా అరనిమిషంలో స్పందించి పనిచేసే హరీశ్ రావు ను మూర్ఖుడు అని సంబోదిస్తున్నావా..?
* నియోజకవర్గ ప్రజల మనోబావాలను పరిగణలోకి తీసుకోకుండా నీ వ్యక్తిగత స్వార్థం కోసం బీజేపీలో చేరి హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలను అనాదలను చేసిన నువ్వు..హుజూరా బాద్ ప్రజలు అనాదలు అవ్వద్దని వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ మీ నియోజకవర్గం అనాదకాదు నేనున్నా అంటూ అభివృద్ది చేస్తున్న హరిష్ రావు గారిని నువ్వు ఎవడ్రా అని సంబోదిస్తున్నావా..
* ఈటెల నీకు పదవి పోతే సంస్కారం ఎలా పోయింది.. ఓటమి భయంతో ప్రెస్టేషన్ ఎందుకొచ్చిందో అర్థం చేసుకో..బీజేపీ నేతలు పట్టించుకోక,ఎన్నిక వాయిదా పడిందని,ప్రజలు చీ కొడుతున్నారని,గెలిచే మార్గం కనిపించట్లేదని,ఓటమి భయంతో ప్రస్టేషన్ లో నోటికి ఏదస్తే అది మాట్లాడుతున్నావు..కానీ అదే హరీశ్ రావు నీన్ను గౌరవంగా మాట్లాడుతున్నారు. రాజేందర్ గారూ అని సంబోదిస్తున్నారు..ఇక్కడ ఎవరు మూర్ఖులంటావు ఈటెల రాజేందర్ గారూ…
* బీజేపీ దేశానికి, తెలంగాణాకు చేస్తున్న అన్యాయాన్ని చెప్తే హరీశ్ రావు గారిని నోటికి ఏదొస్తే అది తిడుతున్నావు..నీ ఓటమి ఖాయమైందని నీకు అర్థమైంది.. గెలవలేనని ఫిక్స్ అయ్యావు. ఏం చేయాలో తెలియక సంస్కారం మరచి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావు..
* ప్రజా నాయకుడు హరీశ్..ఆయన ప్రజల మనిషి ఆపదస్తే అంబులెన్స్ అయిన ఆలస్యంగా వస్తుందేమో కానీ అరనిమిషంలో ఆ ఆపదను తీర్చే గొప్ప నాయకుడు హరీశ్ రావు గారు..రాష్ట్రంలో ఏ మూల నుండి వచ్చినా వారి సమస్య తీర్చిపంపే నాయకుడు హరీశ్ రావు గారు..నిన్ను నమ్మిన నాయకులను నువ్వు నట్టేట ముంచినా..నమ్మిన నాయకుల కోసం నిత్యం వారి బాగోగులు చూసుకుంటూ కొండంత భరోసా ఇచ్చిన నేత హరీశ్ రావు గారు..అలాంటి నాయకునిపై నీ ప్రస్టేషన్ తో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. బీజేపీ చేరగానే తీరు మార్చుకున్నవ్. బాష మార్చుకున్నవ్. బాద్యత మరిచినవ్..బక్వాస్ మాటలు మాట్లాడుతున్నవ్..
* నోరుంది కదా అని సంస్కారం తప్పి ఏది పడ్తే అది అంటే జనం నిన్ను చీకొడతారు..కర్రు కాల్చి వాతపెడతారు..ప్రజల మనిషిని తిట్టడం ఆత్మగౌరవమా ఈటెల..ప్రభుత్వ పథకాలను వ్యతిరేకించడం ఆత్మగౌరవమా ఈటెల రాజేందర్ గారూ..నీడనిచ్చిన కొమ్మ ఐన పార్టీని నరకాలనుకోవటం ఆత్మగౌరవమా ఈటెల గారు..
* హుజూరాబాద్ ప్రజలారా..ఇలా ప్రస్టేషన్ లో ఏది పడితే అది మాట్లాడే నాయకులు కావాలా.అభివృద్ది చేసే నాయకులు కావాలా మీరే తేల్చుకోండి.. తెలంగాణాను నాశనం చేసే వాళ్ళతో చేతులు కలిపే వాళ్ళు కావాలా..తెలంగాణ సమాజాన్ని కాపాడుతూ, తెలంగాణా సబ్బండ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్న నాయకత్వం కావాలా తేల్చుకోండి..
* ఇది తేల్చుకోవాల్చిన సమయం..హుజూరాబాద్ తలరాతను మార్చుకోవాల్సిన సమయం..డిల్లీకి బానిసలుగా ఉందామా..ఇంటి పార్టీతో ఉండి తెలంగాణా ప్రయోజనాలను కాపాడుకుందామా.. ఆలోచించి నిర్ణయం తీసుకోండి..
జై తెలంగాణ
*-Telangana Vijay..*