Political వైసిపి నేత కొడాలి నాని అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు తమ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను ఎవరు ఏమన్నా అస్సలు ఒప్పుకునేదే లేదు అంటూ మాటలతోటాలు విసురుతుంటారు కొడాలి నాని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అంటే కొడాలి నాని కి ఒంటి కాలు మీద లేస్తారు అయితే చంద్రబాబు కూడా వెనక్కి తగ్గేదే లేదు అంటూ నాని విషయంలో ముందుకు దూసుకుపోతున్నారు ఈ ఎన్నికల్లో ఎలా అయినా నానిని దెబ్బతీయాలని పెద్ద ప్లానే వేసినట్టు సమాచారం..
కొడాలి నాని.. చంద్రబాబు, లోకేష్ పేరు వింటేనే ఇంతెత్తున లేచిమరీ కాలు దువ్వుతాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కొడాలి నాని ఓ రేంజ్ లో చంద్రబాబు, టీడీపీపై మండిపడేవాడు. ఇక అధికారంలోకి వచ్చిన మొదలు తన విమర్శలకు పట్ట పగ్గాలు లేకుండా పోయాయి. అదే నిత్యం ఏదో ఒక రకంగా చంద్రబాబు లోకేష్ పై విమర్శలు గుప్పిస్తూ ఉంటాడు… రెండు సార్లు చంద్రబాబు వద్ద నుండి బీ ఫారం తీసుకుని ఎమ్మెల్యేగా విజయం సాధించిన నాని.. ప్రస్తుతం అదే పార్టీకి ఇప్పుడు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. గత ఎన్నికల్లోనే చంద్రబాబు నాని ఓటమికి ప్లాన్ వేసినప్పటికీ అది వర్కవుట్ కాలేదు. ఈ సారి ఎలాగైనా ఒడించాలని పట్టుబట్టుకు కూర్చున్నారని తెలుస్తోంది. చంద్రబాబు, లోకేష్ మాత్రమే కాదు..ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు సైతం ఎలాగైనా నానిని గద్ద దింపాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం..
అయితే ఇటీవల టిడిపి మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ పై కొందరు దుండగులు దాడి చేసి నా సంగతి తెలిసిందే దీనిపై ఆ జిల్లా నేతలు సరిగ్గా స్పందించకపోవడంతో మరుసటి రోజున ఉమ్మడి కృష్ణాజిల్లా నేతలందరితో సమావేశమయ్యారు. గాంధీ అంశంపై పార్టీ నేతల వైఖరిని తప్పు పట్టడంతో పాటు కలిసి పోరాడాల్సిందేనని స్పష్టం చేశారు.