Political ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై టీఎన్టీయుసీ, తెదేపా నేతలు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు ఎన్టీఆర్ యూనివర్సిటీ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ పేరు మార్చే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ముందుగా కార్యకర్తలు వర్సిటీ ప్రధాన గేట్ల ముందు ఆందోళన చేపట్టారు. వర్సిటీ ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. ఈ విషయంపై పలువురు తెదేపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ చేసింది ఎంత మాత్రం సరైన పని కాదని విమర్శలు గుప్పించారు.
ఈ విషయంపై స్పందించిన నారా లోకేష్.. తెలుగు జాతి మొత్తం బాధపడే నిర్ణయం తీసుకున్నారని.. తెదేపా అధికారంలోకి వచ్చాక హెల్త్ యూనివర్సిటీకి మళ్ళీ ఎన్టీఆర్ పేరు పెడతామని.. చంద్రబాబు హయాంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తెచ్చారని అన్నారు. ఇలా యూనివర్సిటీ పేరు మార్చడంపై వైయస్సార్ ఆత్మ సైతం శాంతించదని.. ఎన్టీఆర్ కు అవమానం జరిగితే చూస్తూ ఊరుకోమని సోమిరెడ్డి అన్నారు.. గుంటూరు సంగం డైరీ లో మీడియాతో మాట్లాడిన ధూళిపాల నరేంద్ర.. ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మార్చడం అత్యంత హేయమైన చర్యని అన్నారు. పేర్లు, ఊర్లు మార్చడం తప్ప జగన్ కొత్తగా చేసేదేమీ లేదని.. ఒక్క వైద్యశాలైన కొత్తగా కట్టి దానికి మీ నాన్న పేరు పెట్టుకోండి అని విమర్శించారు.. ఎన్టీఆర్ వర్సిటీకి పేరు మార్చడం చాలా దుర్మార్గమని.. ఇలాంటి చర్యలతో సీఎం జగన్ ను చరిత్ర సైతం క్షమించదని.. ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ప్రతిపాటి పుల్లారావు అన్నారు..