Health తట్టు వ్యాధికి టీకా వచ్చి చాలా సంవత్సరాలే గడిచింది.. ఐనా ఇప్పటికీ ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తూనే ఉంది.. సరైన అవగాహన లేక ఇప్పటికి ఎందరో ఇబ్బందులు పడుతున్నారు..
తట్టు వ్యాధి కోసం కొన్ని విషయాలు తెలుసుకుందాం.. తట్టు ఒక అంటు వ్యాధి. ఈ వ్యాధి ఉన్న వ్యక్తి దగ్గినా, తుమ్మినా ఆ వ్యక్తి లాలాజలం నుంచి వైరస్ గాలిలో కలుస్తుంది. అలా ఆరోగ్యకరమైన వ్యక్తికి కూడా ఇది వస్తుంది.. అలాగే వ్యాధి ఉన్న వ్యక్తిని నేరుగా పట్టుకున్న రావచ్చు.. సాధారణంగా రెండవ వారంలో బయటపడే ఈ వ్యాధి వచ్చినప్పుడు శరీరంపై చిన్న చిన్న పొక్కులా వస్తాయి. దీన్ని టీకాల ద్వారా మాత్రమే నివారించవచ్చు.
చిన్న పిల్లలకు ఈ వ్యాధి వచ్చినప్పుడు జలుబు, జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, కళ్ల మంటలు, కళ్లు ఎర్రబడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి సంబంధించిన అలాంటి లక్షణాలు కనిపించిన వైద్యం ని సంప్రదించి రక్త పరీక్ష చేసుకోవాలి వెంటనే చికిత్స తీసుకోవాలి.. అయితే టీకాలు వేయలేని పిల్లలకు గర్భిణీ స్త్రీలకు ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అందుకే ఇలాంటివారు మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం..
చిన్నపిల్లలు పుట్టగానే మీజిల్స్ వ్యాక్సీన్‌తో పాటు రూబెల్లా వ్యాక్సీన్‌ను రెండు డోసులలో ఇస్తారు. 9 నుంచి 12 నెలల వయసులో మొదటి డోసు, 16 నుంచి 24 నెలల వయసులో రెండవ డోసు వ్యాక్సీన్ వేస్తారు. సారి తెకా వేయించుకున్నాక జీవితాంతం ఎలాంటి భయం లేకుండా ఉండవచ్చు..