Entertainment సుశాంత్ సింగ్ రాజ్పుత్ మూడేళ్ల క్రితం మరణించిన సంగతి తెలిసిందే అయితే ఇతను మరణం అప్పటినుంచి మిస్టరీగానే ఉండిపోయింది ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసినప్పటికీ ఇది నిజం కాదంటూ ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటీనటులు ఆవేదన వ్యక్తం చేశారు తాజాగా ఈ విషయంపై స్పందించారు అతని సోదరి..
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలిసిన వెంటనే సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లు పెట్టాయి.. నెపోటిజమే ఇతన్ని ఈ పరిస్థితికి దిగజార్చిందని అన్నారు అంతేకాకుండా ఇతనిది ఆత్మహత్య కాదు హత్య అంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు అయితే వీటన్నిటిని పట్టించుకోకుండా కేసును క్లోజ్ చేసేసారు పోలీసులు అయితే ఇప్పుడు తాజాగా ఇతనికి పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ స్వయంగా ఇతని హత్యానని చెప్పడంతో మళ్లీ విషయం తెరపైకి వచ్చింది..
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబ సభ్యులు ఇప్పటికే ఈ విషయంపై ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే ఇతను చనిపోయిన దగ్గర నుంచి ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కోరుతూ వచ్చారు. అయినప్పటికీ ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోలేదు తాజాగా రుప్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు అతని సోదరి ఇప్పటికైనా నిజం తెలుసుకొని సుశాంత్ కు న్యాయం చేయాలంటూ కోరారు ఈ కేసును ఎలాగైనా సిబిఐ అప్పగించాలని అన్నారు.. నిజ నిజాలు కచ్చితంగా తొందరలోనే బయటకు వస్తాయని అప్పుడు దోషులకు కచ్చితంగా శిక్ష పడుతుందని అన్నారు అలాగే అంత మంచి వ్యక్తిని ఈ రకంగా చంపటానికి మనసు ఎలా వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు..