Movie టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తనయుడుగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోగా ఎదిగాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అయితే యువతను మీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగితే బాబు అని అంటారు. అలాగే ఆయన తండ్రి కృష్ణ కూడా మహేష్ నటన చూసి మురిసిపోతుంటారు. అయితే ఓ ఇంటర్వ్యూలో ఈతరం హీరోల్లో మహేష్ బాబు కాకుండా మీకు ఎవరు ఇష్టమని అడగగా కృష్ణ ఆసక్తికర సమాధానం చెప్పారు.
కృష్ణను ఓ ఇంటర్వ్యూలో భాగంగా ప్రభాస్.. ఎన్టీఆర్.. అల్లు అర్జున్.. రామ్ చరణ్.. వీళ్ళందర్లో మీకు ఏ హీరో ఇష్టం అని అడగ్గా జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పారు. అంతేకాకుండా ఆయన నటన కోసం ఎంతగానో పొగిడారు. అదే సందర్భంగా సీనియర్ ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
అంతేకాకుండా తనకు ఎన్టీఆర్ కు మధ్య దాదాపు పది ఏళ్లపాటు మాటలు లేవని చెప్పారు. తాను అల్లూరి సీతారామరాజు సినిమా తీసిన తర్వాత ఎన్టీఆర్ చిత్రాన్ని చేయాలనుకున్నారని.. అందుకోసం పరుచూరి గారిని కథ రాయమని అడిగితే.. కృష్ణ అల్లూరి సినిమా చూశారా? అని అడిగారంట. అయితే ఎన్టీఆర్ చూడలేదని సమాధానం చెప్పగా ఓసారి చూడండి అని సలహా ఇచ్చారంట. అప్పటికే నాకు ఎన్టీఆర్ కు దాదాపు 10 ఏళ్ళు మాటలు లేవు. అయితే ఓ రోజు అనుకోకుండా ఎదురుపడితే “బ్రదర్ ఇలా రండి” అని నన్ను పిలవగా.. దగ్గరకు వెళితే.. మీ అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని మీరే దగ్గర ఉండి నాకు చూపించండి అన్నారు. వెంటనే ప్రింట్ తెప్పించి చూపించా.. అంటూ ఆనాటి విషయాలను గుర్తు చేసుకున్నారు.