విజయవంతంగా తొలి చిత్రాన్ని పూర్తిచేసుకున్న విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాధ్ ధ్వయం తదుపరి చిత్రం జేజీఎం ను 3.08.2023న విడుదల చేస్తున్నట్లు వెల్లడి.
సూపర్ స్టార్ విజయ్ దేవరకొండతో యాక్షన్ చిత్రాల దర్శకుడు పూరి జగన్నాధ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎదురుచూస్తున్న వెంచర్ ఇది. ఈ రోజు ముంబైలో జరిగిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో తమ తదుపరి వెంచర్ “JGM”ని గ్రాండ్గా ప్రారంభించారు.
హెలికాప్టర్ ఛాపర్ లో పత్యేకంగా దిగిన విజయ్ దేవరకొండ వాకింగ్ స్టయిల్, ఆర్మీ గెటప్తో పాత్రపరంగా చాలా ఫర్ఫెక్ట్ గా వున్నాడు. వినూత్నంగా ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఓపెనింగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాతలు చార్మికౌర్, వంశీ పైడిపల్లి మరియు శ్రీకర స్టూడియోస్ డైరెక్టర్ సింగారావు పాల్గొన్నారు.
ఇక ఈరోజు విడుదలచేసిన పోస్టర్ లో ఇండియా మేప్ తో పాటు కొందరు సైనికులు కనిపించారు. యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం వుంటుందని తెలుస్తోంది. విజయ్ లుక్ కు నెటిజన్ అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ పోస్టర్ సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.