Drinks For Diabetics: ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు, విపరీతమైన చెమటలు.. డీహైడ్రేషన్, తీవ్రమైన అలసటకు దారితీస్తాయి. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్‌కు ఇబ్బందికరంగా ఉంటుంది. వేసవి కాలంలో డయాబెటిక్ పేషెంట్స్ ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా.. రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతంగా పెరుగుతాయి. దీని కారణంగా అధిక దాహం, తరచుగా మూత్రవిసర్జన, అలసట, బరువు తగ్గడం, అస్పష్టమైన దృష్టి వంటి అనేక సమస్యలు వస్తాయి. వేసవి వేడిని తట్టుకోవడానికి.. షుగర్ పేషెంట్స్ కూడా కూల్ డ్రింక్స్, జ్యూస్‌లు ఎక్కువగా తాగుతూ ఉంటారు. వీటిలోని చక్కెర స్థాయిల కారణంగా.. బ్లడ్ షుగర్ లెవల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. షుగర్ పేషెంట్స్ ఈ సీజన్‌లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే.. కూరగాయల జ్యూస్‌లు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి .
కాకర జ్యూస్..
కాకరలోని ట్రైటెర్పెన్, ప్రొటైడ్, స్టెరాయిడ్, ఆల్కలాయిడ్, అకర్బన, లిపిడ్ , ఫినోలిక్ సమ్మేళనాల రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. కాకరకాయలో ఇన్సులిన్‌లా పని చేసే పోషకాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. షుగర్ పేషెంట్స్ ఉదయాన్ని ఖాళీ కడుపుతో కాకర జ్యూస్ తాగితే.. షుగర్ కంట్రోల్‌లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు
ఉసిరి జ్యూస్..
ఉసిరి జ్యూస్ షుగర్ పేషెంట్స్‌కు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే క్రోమియం ఇన్సులిన్ స్రావాన్నీ పెంచి.. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి. దీని గ్రైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా అడ్డుకుంటాయి.
వేపాకు జ్యూస్..
వేపలో ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. వేప లివర్‌ను డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. మరోవైపు, కలబందలో గ్లూకోమన్నన్ అనే సమ్మేళనం ఉంది, ఇది డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.