మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన సినిమా “ఆరంభం”. ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మించారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించారు. ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన “ఆరంభం” సినిమా రేపు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సక్సెస్ ఫుల్ హీరో శ్రీ విష్ణు అతిథిగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో తిరువీర్, డైరెక్టర్స్ నవీన్ మేడారం, వెంకటేష్ మహా, హీరోయిన్ శివానీ నాగరం గెస్ట్ లు గా పాల్గొన్నారు.
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ : నా ఫ్రెండ్ స్వరూప్ ఆరంభం గురించి చెప్పి ఒక సాంగ్ లాంఛ్ చేయాలని అడిగాడు. అప్పుడు ఓ పది మంది టీమ్ లా నా దగ్గరకు వచ్చారు. ఎవరు వీరంతా అనుకున్నా. సాంగ్ చూశాను. మనస్ఫూర్తిగా ఆ పాటను ఇష్టపడ్డా. టీజర్ చూపించారు. నేను కొత్తవాళ్లతో త్వరగా కలిసిపోలేను. వాళ్లు వెళ్లాక స్వరూప్ కు చెప్పా పాట, టీజర్ చాలా బాగుందని. కంటెంట్ బాగున్న సినిమాలు రిలీజ్ కు రావడానికి కొంత స్ట్రగుల్ తప్పదు. నేను అది ఫేస్ చేశాను.
నా ఫ్రెండ్ ధీరజ్ మొగలినేని ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. అతను మంచి మంచి మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఆరంభం కూడా వర్కవుట్ కావాలి. ఈ సినిమాకు పనిచేసిన టీమ్ ను చూస్తే ముచ్చటేస్తుంది. చాలా బాగున్నారు. నాలుగైదేళ్ల తర్వాత ఈ టీమ్ నుంచి చాలా మంది స్టార్స్ వస్తారు. మంచి కథ కుదిరితే ఇదే టీమ్ తో నేను సినిమా చేయాలని అనిపిస్తోంది. ఆరంభం టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.