Entertainment మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ ఐదేళ్ల క్రితం కళ్యాణ్దేవను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొన్నాళ్ళు వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నప్పటికీ తర్వాత మనస్పర్ధలు వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వీరిద్దరూ విడిపోయారని.. కానీ ఆ విషయం బయటకి చెప్పకుండా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందన లేదు. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా వీరిద్దరూ విడిపోయారు అని వార్తలకు క్లారిటీ వచ్చేసింది.
శ్రీజ కొనిదెల కళ్యాణ్ దేవ్ దాదాపు 5 ఏళ్ళు క్రితం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లు అన్యోన్యంగా గడిపిన ఈ జంట తర్వాత మాత్రం ఇద్దరు మనస్పర్ధలతో విడిపోయారని ఇప్పటివరకు ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై మెగా డాటర్ ను ఎందరో ట్రోల్ చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా కళ్యాణ్ దేవ్ మొదటి సినిమాకు మెగా ఫ్యామిలీ నుంచి ఉన్న అండదండలు తర్వాత సినిమాలకు లేకపోవడం కూడా ఈ వార్తలకు ఓతమిచ్చాయి. అయితే తాజాగా ఇన్స్టా వేదికగా వీరిద్దరూ కోల్డ్ వార్ ను మొదలుపెట్టారు..
ప్రేమికుల రోజు సందర్భంగా కళ్యాణ్ దేవ్ తన ఇన్స్ట పోస్టులో ‘ఒకరిని ఎంత ఇష్టపడ్డాం అనేది కాదు, ఎలా ట్రీట్ చేశాం అనేది ముఖ్యం..’ అని ఇంస్టాగ్రామ్ స్టేటస్ పోస్ట్ చేశాడు. దానికి కౌంటర్ గా శ్రీజా ‘ఒకరి ప్రేమించడం అంటే అర్థం మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేలా చేసుకోవడం కాదు. తమని తాము ఎక్కువగా ప్రేమించబడేలా చేయాలి. ప్రేమను గుర్తించాలి. ప్రతిచోటా దాని కోసం వెతక కూడదు’ అని శ్రీజా ఇంస్టాగ్రామ్ స్టేటస్ పెట్టారు.. దీంతో వీరిద్దరూ విడిపోయారు అనే వార్తలకు క్లారిటీ వచ్చేసింది మనస్పర్ధలతో శ్రీజకు నిధుల కళ్యాణ్ దేవ్ విడిపోయారు అని తెలుస్తోంది..