హార్డ్ కోర్ వైసీపీ వాయిస్ వినిపించే వారికి ఇక్కడ చోటు ఎందుకు లేదు ? రీసెంట్ ఇన్సిడెంట్స్ ఏం చెబుతున్నాయ్!
ఈ మధ్య కాలంలో కేఎస్ ప్రసాద్ ఒక చిన్న యూట్యూబ్ చానెల్లో చేరాడు. ఈ సందర్భంగా ఆ చానెల్లోని ఒక వీడియో ఎడిటర్ కి ఆయన చెప్పిన మాట ఏంటంటే.. PD TV- జానీని సాక్షిలో తాను చేర్పించాలనుకున్నాననీ..అయితే అక్కడి ఎడిటోరియల్ టీమ్ వారు అతడ్ని ససేమిరా చేర్చుకోలేమన్నారనీ.. ఆయన చెప్పినట్టు సమాచారం.
దీన్నిబట్టీ అర్ధమవుతున్నదేంటంటే.. వీరు హార్డ్ కోర్ వైసీపీ వాయిస్ వినిపించే వారిని దగ్గరకు కూడా రానివ్వరు. దానికి తోడు సాక్షి టీవీని కూడా సమర్ధవంతమైన వైసీపీ వాదులతో నడపడం లేదన్న ముద్ర ఈనాటిది కాదని అంటారు.. అప్పుడెప్పుడో 2014 ఎన్నికల నాటికి ముందు చానెల్లో సమర్ధవంతమైన ప్రో వైసీపీ వాయిస్ వినిపించే వ్యవస్థ ఉన్నా.. దాన్ని తర్వాతి రోజుల్లో డిమాలిష్ చేశారనీ. ప్రెజంట్ అది ఉత్తుత్తి జర్నలిస్టులతో నడుస్తోందన్న టాక్ చాలా వైడ్ గా స్ప్రెడ్ అవుతోంది మీడియా వర్గాలతో పాటు.. వైసీపీలో కూడా.
ప్రస్తుతం ఇక్కడ పని చేస్తున్న వారు పెద్ద గొప్ప వైసీపీ వాదులు కారు. పార్టీకి పనికొచ్చే వాయిస్ వీరిలో పెద్ద గొప్పగా ఏం ఉండదు. అందరూ ఉద్యోగులే. ఉద్యమకారులేమాత్రం కారు. ఈ డయాస్ మీద నుంచి చేయాల్సింది ఉద్యోగం కాదు- ఉద్యమం. కానీ, అలాంటి ఆలోచన కానీ అభిప్రాయం గానీ ఇక్కడి జనాల్లో ఉన్నట్టే అనిపించదని అంటారు కేఎస్ ప్రసాద్ వంటి వారు. దీంతో సాక్షి వైసీపీకి ప్లస్ కావల్సింది పోయి మైనస్ గా మారుతోన్న మాట కూడా ఒకింత ఎక్కువగానే వినిపిస్తోంది.
బేసిగ్గా సమర్ధవంతమైన రైటప్, శక్తిమంతమైన టాక్టివ్ నెస్ ఉన్న వారెవరినీ వీళ్లు పెద్దగా ఎంకరేజ్ చేయరనీ.. పైపెచ్చు వీళ్లను చేర్చుకోవడం ద్వారా.. ఎక్కడ తమ ఉద్యోగాలకే ఎసరు వస్తుందో అన్న భయాందోళనలో వీరు ఉంటారనీ అంటారు.. మాములుగానే సాక్షిలో చేరడానికి బయట నుంచి ఎవరూ పెద్దగా రారనీ.. వచ్చినా వారిని వీళ్లు బతకనివ్వరనీ చెప్పుకొస్తారు కొందరు మాజీ సిబ్బంది.
సాక్షి టీవీలో చేరుతున్నానని ఎవరైనా సాక్షి మాజీ ఎంప్లాయిస్ ని అడిగితే.. వాళ్లు చెప్పే ఒకే ఒక్క మాట.. ఎందుకన్నా! బయట ఎక్కడైనా చూసుకోవచ్చు కదా!? ఎందుకు అనవసర రిస్కూ.. అన్న సలహా సూచనలిస్తుంటారని టాక్. ఇదిలా ఉంచితే.. ఇక్కడి అవుట్ పుట్ మీదున్న కసీ- క్రోధం కొద్దీ.. అతడి మీద దాడికి యత్నించారట.. ఆయన కింద సబ్బులుగా పని చేసిన వారు. అంతగా ఆ మైనార్టీ బాస్ టార్చర్ ఉంటుందనీ. రెండు నిమిషాల లేట్ ని కూడా ఒప్పుకోక హెచ్ ఆర్ కి చెప్పేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తాడనీ.. దీంతో ఈ బాస్ ని యాక్సిడెంట్ చేసి లేపెయ్యాలని వీళ్లంతా ప్లాన్ చేశారనీ అంటారు.
బేసిగ్గా సాక్షి నిర్వాహకులు ఏం చేస్తారంటే తమ చెప్పు చేతల్లో ఉండే మానసిక స్థితిగల అల్పులను, ఏమీ చేతగాని వాళ్లనూ చేర్చుకుంటారనీ.. తీరా చూస్తే వాళ్లు పనికిమాలినోళ్లుగా వీళ్లే లెక్క గట్టి ఉద్యోగాల్లోంచి తీసేస్తుంటారనీ… ఎప్పుడూ ఇక్కడ ఏదో ఒక అనిశ్చితి ఉండేలా జాగ్రత్త పడతారనీ చెబుతారు.
ఇలా వాళ్లలో వాళ్లే ఉద్యోగుల ఎంపికలో తప్పు చేసి.. ఆపై వాళ్లే పనిలోకి వచ్చిన వాళ్లను తప్పు పట్టేలా చిత్రీకరిస్తుంటారనీ.. అందుకే జానీ లాంటి వారిని వీళ్లస్సలు ఎంకరేజ్ చేయరనీ. బేసిగ్గా వాళ్లకు కావల్సింది సాక్షి ద్వారా పార్టీ వాయిస్ పబ్లిక్ లోకి వెళ్లడం కానే కాదని.. ఏ పనీ పాట చేయకుండా యాజమాన్యాన్ని మభ్య పెడుతూ తద్వారా తమ తమ పబ్బం గడుపుకోవడమేననీ అంటారు.. ఇందులో వీరు ఆరితేరి పోయారనీ.. ఇలాంటి వారిని నమ్మి భారతీరెడ్డి ఈ చానెల్ ని ఒక నిరర్దక ఆస్తిగా మార్చి చాలా కాలమే అయ్యిందనీ చెప్పుకొస్తున్నారు మాజీ ఉద్యోగులు.
వీటన్నిటినీ బట్టి చూస్తే సాక్షి ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ జగన్ అండ్ హిజ్ పార్టీ అని కుండ బద్ధలు కొట్టినట్టు చెప్పుకొస్తారు కొందరు మీడియా రంగ నిపుణులు. ఇక జగన్ సైతం తమ ఆధీనంలో ఉన్న సాక్షిని తప్ప మరే మీడియా హౌస్ ని కూడా తమ పార్టీ నాయకుల ద్వారా పెట్టనివ్వరనీ.. ఎవరైనా అలాంటి ప్రపోజల్ ముందుకు తెస్తే.. మనకు సాక్షి ఉందికదన్నా! అంటూ మాట దాట వేస్తుంటారనీ. దీంతో ఇటు గోడ దెబ్బ- అటు చెంపదెబ్బగా మారిందనీ వాపోతుంటారు కొందరు వైసీపీ నాయకులు.
ఇక్కడ చూస్తే పార్టీ వాయిస్ బలంగా వినిపించే వారిని ఉద్దేశ పూర్వకంగా తీసుకోక.. అటు చూస్తే బయట వారినెవరినీ ఒక చానెల్ పెట్టడానికి ఎంకరేజ్ చేయక.. ఏంటీ దుస్థితి అని బాధ పడుతున్న వైసీపీ నాయకులు చాలా మందే. పార్టీకి సాక్షి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్న భావనలోకి అభిమానులను ఎప్పుడో నెట్టేశారనీ చెప్పుకొస్తారు ఇంకొందరు.
ఇప్పుడేం చేయాలి? అని చూస్తే.. కరడుగట్టిన వైసీపీ వాదులను అయినా చానెల్లో చేర్చుకోవాలి. లేదంటే బలమైన జర్నలిస్టిక్ లైన్ తెలిసిన వారికైనా చానెల్ని అప్పగించాలి. ఇదేదీ లేక పోవడంతో ఇటు రాజకీయంగా, అటు జర్నలిజం పరంగా అనమాకులు ఇక్కడ రాజ్యం చేస్తున్నారనీ.. నిజానికి సాక్షిలో తొలి నాళ్లలో ఉన్న టీం తప్ప.. ఇప్పుడున్నదసలు వారియర్ టీమే కాదనీ.. అయినా తెలంగాణకు చెందిన ఒక రెడ్డిని కులాభిమానం కొద్దీ ఎడిటోరియల్ చీఫ్ గా నియమిస్తే.. ఎక్కడో ఏపీలో ఉన్న సగటు వైసీపీ వీరాభిమాని ఆవేదన అతనికేం తెలుస్తుందన్న కామెంట్లు జోరుగా పేలుతున్నాయ్.
ఇదే ఎన్నికల ఫలితాల సమయంలో ఎవరో యూట్యూబర్లు చేసిన ఈవీఎం ట్యాంపరింగ్ వీడియోలను షేర్ కొట్టుకున్నాయి వైసీపీ శ్రేణులు. దీన్నిబట్టీ చెప్పొచ్చు సాక్షి కేవలం పక్షి లేని పంజరంగా మాత్రమే మిగిలి ఉంది తప్ప.. ఇది ఎంత మాత్రం అగ్రెసివ్ గా వెళ్లలేని దుస్థితిలోకి నెట్టివేయబడి చాలా కాలమే అయ్యిందని. అంతటి దయనీయమైన మానసిక స్థితిలో ఇక్కడ పని చేసే వారు ఉంటారనీ బాహటంగానే చెబుతున్నారు కొందరు ప్రో వైసీపీ మీడియా జర్నలిస్టు మిత్రులు.
అప్పుడెప్పుడో కేఎస్ఆర్ వంటి వారి నియమాకాల్లో పరిణితి తప్ప.. ప్రస్తుతానికైతే.. పార్టీ వాయిస్ బలంగా వినిపించే ఎత్తుగడలేవీ సాక్షి యాజమాన్యం వేయడం లేదనీ.. గతంలో ఇక్కడ నేమాని వంటి కరడుగట్టిన వైయస్ అభిమానులుంటే వారిని కూడా సలహాదారు పోస్టు నెపంతో పక్కన పెట్టేయడంతో ఇలాంటి వారి పర్యవేక్షణ కూడా లేక సాక్షి ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు కేవలం పక్షిలేని పంజరంలా మిగిలిందన్న టాక్ బలంగానే స్ప్రెడ్ అవుతోంది. మరి చూడాలి.. ఇకనైనా సాక్షిని బలపరచడమా లేదంటే.. ఇతర మీడియా హౌస్ లకు అవకాశమివ్వడమా.. అంతా జగనన్న చేతులో ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కొందరు ప్రో వైసీపీ మీడియా వాదులు.
ఇటు చూస్తే టీడీపీ దాని కూటమి పార్టీలైన.. బీజేపీ, జనసేన తరఫున ఏబీఎన్- ఆంధ్రజ్యోతి, ఈటీవీ- ఈనాడు గ్రూపులు, టీవీ 5, మహాన్యూస్ వేదికల మీద నుంచి.. రాధాకృష్ణ, వెంకట కృష్ణ, మూర్తీ, సాంబ, వంశీ వంటి వారికి పార్టీ తరఫున పట్టాభి, కొలికిపూడి, రాజేష్ మహాసేన వంటి వారు.. ఒక జట్టు కట్టి టీడీపీకి ఆయువు పట్టులా నిలుస్తుంటే.. వీటికి జనసేన తరఫున 99 టీవీ, ప్రైమ్ నైన్ టీవీ వంటి చానెళ్లుగా అంచెలంచలుగా యాంటీ వైసీపీ దాడి చేస్తుండగా.. బీజేపీ నుంచి వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నుంచి జగన్ కి వ్యతిరేక వాయిస్ వినిపిస్తుంటే.. కౌంటర్ అటాక్ చేయడానికి దిక్కులేదు.
ఇదే ఆంధ్రజ్యోతి.. జగన్ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తిని తనఖా పెట్టిందని దుష్ప్రచారం చేస్తే.. దాన్ని సామాన్య జనం నమ్మేస్తే కౌంటర్లెక్కడ? ఇక వివేకా హత్యా నిందారోపణల సంగతి సరేసరి. ఇలాంటి ఎన్నో అసంబద్ధమైన వార్తలను ఎల్లో మీడియా వండి వార్చుతుంటే.. సగటు వైసీపీ వీరాభిమానికి వాదననిచ్చే వ్యవస్థ ఎక్కడ? అంతెందుకు భారతీ రెడ్డికి- అవినాష్ రెడ్డికి రంకు అంటకడుతుంటే.. ఇంతలేసి జీతాలు కోట్ల కొద్దీ ఖర్చు పెట్టి నడుపుతున్న ఈ మీడియా వ్యవస్థ కిక్కురుమన్న పాపాన పోలేదు. ఇందుకేనా.. ఈ సాక్షి ఉన్నది. ఇదసలు నిజానికి- సాక్షి కానే కాదు. నిజం బయటకు రాకుండా అడ్డుకునేలాంటి మానసిక స్థితికి ప్రత్యక్ష సాక్షి అన్న మాట గట్టిగానే వినిపిస్తోంది బయట.
టీడీపీ కూటమి తరఫున మీడియా వ్యవస్థ ఏనుగంత ఉంటే.. వైసీపీకి.. సాక్షి దాని అనుబంధ పత్రిక ఉన్నా లేకున్నా ఒకటే! అన్న పేరు మూటగట్టుకుంటోందని అంటున్నారు కొందరు. జర్నలిస్ట్ సాయి, శ్యామల వంటి ఒకరిద్దరు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్న వాయిస్ కూడా ఏమంత గొప్పగా పేలడం లేదనీ. ఆ సాయి చూస్తే.. హిందుత్వ పోకడలతో ఉంటాడని. లడ్డూ వంటి ప్రో హిందూ వ్యవహారాల్లో అతడు పార్టీని నిలువునా ముంచేస్తాడనీ… ఇక శ్యామలకున్న వాయిస్ కల్ట్ పెద్ద గొప్పగా నిలబడేది కాదనీ.. ఇలాంటి బలహీన మనస్తత్వం గల వారితో వైసీపీ వచ్చే 2029- ఎన్నికల నాటికి నిలబడే ప్రసక్తే లేదన్న మాట ఒకింత బలంగానే వినిపిస్తోంది.
ఇకనైనా జగనన్న ఈ దశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తారా లేక తొలి నుంచి తన మీడియా సపోర్టు ఎలాగూ లేదు కాబట్టి.. తానేంటో తన జనం, తన దైవ జపం ఏంటో అన్న పరిమిత శక్తియుక్తులతోనే 2029- ఎన్నికలకు సమాయుత్తం అవుతాడా లేదా? తెలియాల్సి ఉందంటున్నారు కేఎస్ ప్రసాద్ వంటి రాజకీయ విశ్లేషకులు.
ఇట్లు : ఓ ప్రో వైసీపీ ఇన్ ఫ్లూయెన్షర్ థాంక్యూ జగనన్నా , ఒక మంచి నిర్ణయం మీ నుంచి ఉంటుందని ఆశిస్తున్నామన్నా.. ఆమెన్!!!