జాయింట్ కమీషనర్ అఫ్ పోలీస్ ట్రాఫిక్, సైబరాబాద్ శ్రీ డి. జోయెల్ డేవిస్, ఐపీఎస్., ఈరోజు ట్రాఫిక్ సిబ్బంది తో రాంగ్ రూట్ డ్రైవింగ్ అనే అంశంపై సైబరాబాద్ మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ జాయింట్ సీపీ మాట్లాడుతూ.. ఇతరుల ప్రాణాలకు, వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే విధంగా నిర్లక్ష్యంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసినందుకు 2024 ఏప్రిల్ నెలలో 239 వాహనదారులపై సెక్షన్ 336 IPC ప్రకారం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు FIR లు నమోదు చేయడం జరిగిందన్నారు.
ఈ సమావేశంలో ముఖ్యంగా అధికారులందరికీ ఈ కింది సూచనలు చేయడం జరిగింది.
1. రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ఎన్ఫోర్స్మెంట్ చేయాలనీ సూచించారు.
2. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారిని గుర్తించేలా సీసీటీవీలో నిఘా ఉంచాలని సూచించారు.
3. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారిపై చట్టరిత్యా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో మాదాపూర్ మేడ్చల్ ట్రాఫిక్ డిసిపి డివి శ్రీనివాసరావు, ఐపీఎస్, ట్రాఫిక్ ఏడీసీలు, ఏసీపీలు ఇన్స్పెక్టర్లు తదితర సిబ్బంది పాల్గొన్నారు.