`రెమో, వరుణ్ డాక్టర్` చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా విశ్వనటుడు కమల్ హాసన్ నిర్మాణంలో ఓ చిత్రం రూపొందబోతోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రానికి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భాగస్వామ్యం కావడం విశేషం. ఈ విషయాన్ని తెలుగువారి పండుగైన కనుమ రోజు ఆదివారంనాడు ప్రతికా ప్రకటనలో తెలియజేశారు.
ప్రముఖ సంస్థ సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా తమిళ సినిమాల్లోకి భారీస్థాయిలో అడుగుపెట్టింది. ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (ఆర్.కె.ఎఫ్.ఐ.)తో నిర్మాణంలో పాలుపంచుకుంది. ఇంకా పేరు పెట్టని ఈ తమిళ చిత్రంలో శివకార్తికేయన్ నటించనున్నారు. రాజ్‌కుమార్ పెరియసామి రచన, దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా (ఎస్‌పిఎఫ్‌ఐ( బేనర్‌లో ఆర్.మహేంద్రన్ నిర్మించనున్నారు గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుంది.
ఈ సందర్భంగా నిర్మాత కమల్ హాసన్ మాట్లాడుతూ… “చక్కటి కథ, కథనంతో మా బేనర్‌లో 51వ చిత్రం రూపొందుతోంది. ఈ కథ అన్ని రకాలుగా ప్రేక్షకులను ఆలోచించేలా చేస్తుంది. సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియాతో కలిసి పని చేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను, నటుడు శివకార్తికేయన్, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఈ ఆకట్టుకునే కథను వెండి తెరపైకి తీసుకురానున్నారు.