Bhakthi ఇల్లు సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో నిండి ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు అయితే ఎందుకు వారంలో ప్రతిరోజు ఏరోజు ఏ దేవుని పూజించాలో పూర్తి వివరణ శివపురాణం వివరిస్తుంది అయితే ఇందులో ఏముందంటే..
ఏ వారం ఏ దేవుడిని పూజించాలో శివపురాణం వివరిస్తుంది. అయితే వారంలో ముందుగా వచ్చే ఆదివారం నాడు సాక్షాత్తు ఆ సూర్య భగవాన్ ని పూజించడం వల్ల ఎన్నో ఫలితాలు ఉంటాయని తెలుస్తోంది.. సూర్యుని పూజించడం వల్ల ఆరోగ్యానికి సంబంధించి అలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయని తెలుస్తోంది అలాగే ఒక సంవత్సర కాలం పాటు ప్రతి ఆదివారం సూర్య భగవానుడిని పూజించి వేద పండితులకు భోజనం పెట్టడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయని శివపురాణం వివరిస్తుంది.. అలాగే సోమవారం నాడు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆమె అనుగ్రహాన్ని పొందవచ్చు అని తెలుస్తోంది అదేవిధంగా మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ఎలాంటి అనారోగ్యం సమస్యలైన తీరిపోతాయని కోరిన కోరికలు నెరవేరుతాయని తెలుస్తోంది..
అలాగే బుధవారం రోజు ఆ సాక్షాత్తు మహావిష్ణువుని పూజించి ఆయనకు పెరుగు అన్నాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల కష్టాలు తీరుతాయని తెలుస్తోంది.. అలాగే లక్ష్మివారం, శుక్ర వారం తమ ఇష్ట దైవాన్ని పూజించి వారికి పాలతో నెయ్యితో చేసిన పదార్థాలు నైవేద్యంగా ఉంచటం వల్ల కోరిన కోరికలు తీరుతాయని చెబుతోంది.. అలాగే శనివారం రోజు రుద్రాది దేవతలను పూజించడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయని శివపురాణం వివరిస్తుంది..