Ayodhya Ram Mandir : భారతదేశ చరిత్రలోనే 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాలో భాగమైనందుకు ఎంతో గర్వంగా ఉండని శ్రేయస్ వీడియోస్ వెల్లడించారు. ప్రయగ్రాజ్ లో అంతటి మహా కుంభమేళ జరుగుతున్న ఆధ్యాశ్రీ ఇన్ఫోటైన్మెంట్ & బిజ్ భాష్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి పనిచేయడం తమకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నారు.
ఈ మహా కుంభమేళా ఇంత ఘనవిజయంగా సాగడానికి ముఖ్య కారణమైన గౌరవనీయులు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, సాంస్కృతి & పర్యాటక మంత్రి జోద్పూర్ గారికి, అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి గాను ఎంతో కష్టపడి రేయి పగలు తేడా లేకుండా దైవ సేవగా భావిస్తూ 25 రోజులపాటు అయోధ్య రామ మందిరాన్ని ప్రయాగ్రాజ్ లో రీ క్రియేట్ చేస్తూ వెయ్యి మందికి పైగా పనిచేయడం జరిగింది. వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ మహా కుంభమేళా భారతదేశంలోని తాము చూసిన అత్యంత దైవత్వం కలిగిన ఈవెంట్గా భావిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కుంభమేళకు వచ్చిన భక్తులందరికీ అయోధ్య రామ మందిరం ఎలా ఉంటుందో అనేది కంటికి కట్టినట్లు చూపించాలి అనే ఆలోచన ఎంతో గొప్పదని, దాని నిర్వర్తించడంలో తాము తమ సాయశక్తుల కష్టపడి భక్తిశ్రద్ధలతో పనిచేసినట్లు తెలుపుతూ దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి తాము రుణపడి ఉంటామని శ్రేయస్ మీడియా తెలిపారు.