ఐటీ కారిడార్‌లో శిల్పాలేఔట్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్‌ను శుక్రవారం ప్రారంభించనున్నారు. హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంతోపాటు రోడ్ల కనెక్టివిటీకి చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా ఆరేండ్ల్లలో 17 ప్రాజెక్టులు పూర్తిచేసినట్టు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు.
ఔటర్ రింగ్ రోడ్‌కు కనెక్టివిటీని మెరుగుపర్చడమే కాకుండా గచ్చిబౌలి జంక్షన్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఉద్దేశించిన శిల్పాలేఔట్ ఫ్లైఓవర్‌ను శుక్రవారం ప్రారంభించనున్నట్టు తెలిపారు. గురువారం ట్విట్టర్‌లో ఫ్లైఓవర్ ఫొటోలను కేటీఆర్ పోస్టు చేశారు.
https://www.youtube.com/watch?v=fAdC9YPYkLo