చైతన్యరావు మాదాడి, భూమి శెట్టి, నందకిషోర్ నటీనట వర్గంగా కుమార స్వామి చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’
తెలంగాణ యాసలో వచ్చిన ఈ సినిమా ఎలాగుంది ? అంటే ఫస్ట్ ఇది బాగా తెలిసిన కథ.. అట్ ద సేమ్ టైమ్.. ప్రింట్ కమ్ ఎలెక్ట్రానిక్ మీడియాలో బాగా నలిగి\ నలిగి నానిన కథ.. కరక్కాయ నుంచి- కాకరకాయ వరకూ ప్రతిదీ ఒక చైన్ లింక్ స్కామే అంటూ చాలానే కథనాలు వచ్చాయి.. ఇవెలా జనాన్ని ఎలా పీడిస్థాయో ఇప్పటికీ ససాక్ష్యాలుగా.. ఉన్న ఆనవాళ్లు యూట్యూబ్ లో బోలెడు ప్రధాన చానెళ్లు, పత్రికల నిండా ఈ టైపాఫ్ కథనాలే.. (ఆమాటకొస్తే నేనే కొన్ని పదుల సార్లు ఫోకస్ లు రాశా.. బీఅలర్ట్ రాసిన టైంలో)
నిజానికి ఒక తెలిసిన కథను గుర్తు పట్టకుండా టూ హిలేరియస్ గా గానీ టూ సీరియస్ గా గానీ తీయాల్సి ఉంటుంది.. కానీ కొందరు ఒక కథను ఏదో ఊపిరి బిగబట్టినట్టు బిగబట్టి రాసుకొస్తుంటారు. ఇది వర్కవుట్ కాదనేది నా అభిప్రాయం. గతంలో అంబాజీపేట బ్యాండు మేళం విషయంలో కూడా సరిగ్గా ఇలాగే రాశాన్నేను. కారణం ఏంటంటే.. సినిమా అన్నది నా దృష్టిలో తీయాలని తీసేది ఎప్పటికీ కాదు.. ఈ విషయం ప్రపంచానికి తెలియాలన్న ఆలోచనతో తీయాల్సింది. అది కూడా భారీ తెరపై భారీ ఎత్తున. అరే బై నీకేమైనా పిచ్చి లేచిందా.. ఇదే తెలంగాణల.. కరీంనగర్ సెంటర్ల.. ఎంత మంది చైన్ లింక్ సిస్టమ్ స్కీమ్ వల్ల ఆగమైన్రు బయ్ అని ఎవరైనా అనొచ్చు. కానీ దీనిపై ఇటు పోలీసు అటు మీడియా వర్గాలు పెద్ద ఎత్తున కథనాలు, ప్రకటనలు గుప్పించాయ్.. కాబట్టే ఇలా రాయాల్సి వస్తోంది.
దానికి తోడు ఇప్పుడా చైన్ లింక్ మాఫియా దాదాపు అండర్ గ్రౌండ్ కి వెళ్లినట్టే చెప్పాలి. ఏ ఒకటీ అరా తప్ప.. మిగిలిన అందరికీ చైన్ లింక్ దందా గురించి బాగా తెలిసిపోయింది.. ఊళ్ల నుంచి పట్టణాల వరకూ అందరూ బాగానే ఈ విషయంలో తగిన నాలెడ్జ్ కలిగి ఉన్నారనే చెప్పాల్సి ఉంటోంది. చివర్లో సినిమా ఒక ఊపు అందుకుంది. కానీ స్టార్టింగ్ ఇదే సినిమాలో చూపించే సీరియల్ తో పోటీ పడింది. పాటలు కూడా ఏమంత హిట్ కాలేదు. ఇప్పుడంతా బలగం మేనియా నడుస్తోంది. బలగంలా మారుమూల ఏదో ఒక సమస్య పట్టుడు. దాన్ని బర్ర బర్ర రీలు చుట్టుడు జేస్తే.. అదేదైనా వర్కవుట్ అవుతుందేమో అన్న ఆశ.. మా బాగైందీ మధ్య.. ఈ షరుతులన్నిటినీ వర్తింప చేసుకుని వచ్చిందే.. ఈ చిత్రం కూడా.
సినిమా బాగాలేదని కాదు. మలుపులు తిరగలేదని కాదు. అన్నీ మా బాగున్నయ్ తీ.. కానీ ఎందుకో ఇలాంటి ప్రయత్నాలకు ఇక ఫుల్ స్టాప్ పెట్టవలసిందే అనిపించిందీ చిత్రం. ఎందుకంటే సినిమా రన్ పెద్ద గొప్పగా లేదు. ఎంటర్టైనింగా లేదు.. తొలి పది నిమిషాల్లోనే కాన్ ఫ్లిక్ట్ అర్ధమై పోవాలి.. ఇక్కడా లాగ్ తీసుకున్నారు. సరే అక్కడి నుంచైనా ఊపందుకుందా అంటే స్టోరీ సో సోగానే వెళ్లింది. ఏ థ్రిల్లూ లేదు. అంతా కలసి గోల్డ్ ప్లేట్ మోసం పైనా భారం వేశారు. ఎప్పుడైతే ఈ స్కీమ్ ముచ్చట తెరపైకొచ్చిందో… అప్పుడే ఈ స్కామ్ మెయిన్ స్కీమ్ గా మనోళ్లు వెళ్తున్నారని అర్ధమై పోతూ వచ్చింది. ఆపై ఒక్కో సన్నివేశం అనుకున్నట్టుగానే సా.. గి పోయింది.
ఈ సాగదీత సినిమాను ఆదివారం కాబట్టి.. ఐపీఎల్లో సన్ రైజర్స్ పెద్ద గొప్పగా ఆడ్డం లేదు కాబట్టి.. టీవీ మ్యూట్ పెట్టి దీన్ని లాప్ లో సౌండ్ పెట్టా.. అదీ- ఇదీ రెండూ నిద్రమాత్రల్లాగానే సాగాయ్ తప్ప.. ఏ మాత్రం టెంపో లేదు. ఎవరో ఒక ఫేస్ బుక్ ఫ్రెండ్ ఈ సినిమా గురించి పాజిటివ్ గా రాయడంతో.. నిజంగానే ఇందులో ఏదైనా వండర్ దాగి ఉందేమోని ఓ లుక్కేశా.. అది నా టైమ్ మొత్తాన్ని బొక్కేసింది. ఇందు మూలంగా యావన్మందికో మాట తెలియ రాస్తున్నా. మొహమాటం కోసం.. మనోళ్లన్న ఆలోచన కొద్దీ.. ఒక సినిమాను కావాలని పొగడొద్దు. సరిగ్గా అదే సమయంలో అది పనిగా తిట్టొద్దు.
నా విషయానికే వస్తే.. ఆ ప్రొడక్షన్ కంపెనీలో నాకో సినిమా ఆఫర్ వస్తుందని తెలిసినా సరే.. నేను వారి సినిమాను నిర్మొహమాటంగా ఉన్నది ఉన్నట్టు రాస్తా. అందరూ అలాగే ఉండాలని లేదు. కొందరు వామపక్షులు.. కూడా.. ఇలాంటి పక్షవాతంతో అలమటిస్తున్నారేమో అనిపిస్తుంది. నా దృష్టిలో డాక్టర్ కి ఉండాల్సిన రాగద్వేష రాహిత్యం ఒక రివ్యూ రైటర్ కి ఉండాలనిపిస్తోంది నాకు. మనోళ్లయితే ఒకలా- పరాయి వాళ్లయితే వీరంగమాడేస్తూ తూర్పార పట్టేస్తూ.. రివ్యూలు రాయడం సరైన పని కాదు.
అది జై భీమ్ అయినా, పలాస అయినా, కేరళ స్టోరీ అయినా, కశ్మీర్ ఫైల్స్ అయినా, బస్తర్ అయినా ఒకేలా రియాక్ట్ కావాలి. కానీ మనకు నచ్చేవైతే ఒకలా.. నచ్చనివైతే మరోలా రియార్ట్ కావడం ఐ థింక్ ఇట్స్ నాట్ ద కరెక్ట్ వే. మన సోషల్ మీడియా అకౌంట్లో మనం రాసేదంతా చదివే వాళ్లూ ఉన్నారు కదాని.. అన్ని విషయాల్లో జనాన్ని పిచ్చోళ్లని చేయొద్దు. ఒక రోజున నువ్వే పెద్ద పిచ్చోడివైపోతావ్.. ఇలా ఎందుకో కొందర్ని చూసి రాయాలనిపించింది.. ఇక్కడెలాంటి షరతులు వర్తించవు- వర్తించ కూడదు కూడా.