Pathaan Movie : దాదాపు నాలుగేళ్ల తర్వాత బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ వెండితెరపై కనిపించేందుకు రెడీ అయ్యాడు. యాక్షన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో “పఠాన్” సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు షారూఖ్ సిద్దమయ్యారు. ఈ సినిమాలో షారూఖ్ కి జోడీగా దీపికా పదుకొనే నటిస్తుండగా.. ప్రముఖ హీరో జాన్ అబ్రహం విలన్ గా నటిస్తున్నారు. జనవరి 25న పఠాన్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది.
ఇప్పటికే పఠాన్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అడ్వాన్స్ బుకింగ్ నాలుగు రోజుల ముందే ఓపెన్ చేయడంతో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. షారుఖ్ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతోనే లక్షల్లో టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలో రిలీజ్ కు ముందే పఠాన్ మూవీ రికార్డులూ సృష్టిస్తోంది. పాన్ ఇండియా స్థాయిని దాటి.. పాన్ వరల్డ్ మూవీగా పఠాన్ మారింది.
ఏకంగా 100కు పైగా దేశాల్లో.. 2,500కు పైగా స్కీన్లలో రిలీజ్ అవుతోంది. ఈ రేంజ్ లో మూవీ రిలీజ్ అవ్వడం ఇండియా సినిమా చరిత్రలోనే తొలిసారి అని ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ వైస్ ప్రెసిడెంట్ నెల్సన్ డిసౌజా చెప్పారు. ‘‘యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో ఇది నాలుగో సినిమా. ఓవర్ సీస్ లో పఠాన్ భారీ వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నాం. ఈ సంవత్సరంలో థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌కు ఈ మూవీ తిరిగి ఉత్సాహాన్ని తీసుకొస్తుంది’’ అని ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ మూవీ రిలీజ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ గా మారింది.