Entertainment టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పటికే జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే పర్సనల్ లైఫ్ విషయంలో ఆరోగ్యం పరంగా ఇప్పటికే పలు సమస్యలు ఎదుర్కొంది అయితే అన్నిటిని తట్టుకొని ఎంతో ధైర్యంగా ముందుకు వెళుతుంది తాజాగా ఈమె నటించిన శకుంతల సినిమా సైతం త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతుంది అయితే ఈ నేపథ్యంలో కోలీవుడ్ టాలీవుడ్లలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలు హంగామా నడుస్తుంది అయితే థియేటర్ల ముందు హీరోయిన్ లా పోస్టర్లు చూసి ఒక నెటిజన్ ఇచ్చిన కామెంట్ కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చేసింది సమంత..
ప్రస్తుతం తమిళనాడులో నయనతార నటించిన ‘కనెక్ట్’ మూవీతో పాటు ప్రదర్శించబడుతున్న మరికొన్ని లేడీ ఓరియెంటెడ్ మూవీస్ విషయంలో సమంత కామెంట్‌కు ఓ నెటిజన్ వ్యంగ్యంగా రిప్లై ఇవ్వగా అతనికి తనదైన శిలిలో కౌంటర్ ఇచ్చేసింది..
ప్రస్తుతం చెన్నైలోని క్రోంపేటలో థియేటర్ కాంప్లెక్స్‌లో వరుసగా నయనతార, త్రిష, ఐశ్వర్య రాజేష్ నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు ప్రదర్శించబడుతున్నాయి. ఇందుకు సంబంధించిన బ్యానర్లు కూడా వరుసగా కనిపించడంతో ఫొటో తీసిన అభిమాని ఒకరు.. తమిళ సినిమా సాధించిన ప్రగతిని ప్రశంసిస్తూ.. ‘పదేళ్ల క్రితం ఇలాంటి సీన్ అస్సలు ఊహించలేనిది’ అంటూ పోస్టు చేశాడు. కాగా ఈ పోస్టును ‘మహిళలు ఎదుగుతున్నారు’ అని సమంత రీట్వీట్ చేయగా.. మరొక నెటిజన్ ‘మళ్లీ పడిపోయేందుకే’ అని వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. దీనిపై స్పందించిన సమంత ‘బౌన్స్ బ్యాక్ కావడం మునుపటి కంటే మరింత స్వీట్‌గా ఉంటుంది మిత్రమా’ కౌంటర్ ఇచ్చింది..