Health కొందరు ఉప్పును ఎక్కువగా తీసుకున్న పర్వాలేదు దానికి తాము మినహాయింపు అనుకుంటూ ఉంటారు.. అయితే ఉప్పును ఎక్కువగా తీసుకుంటే పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.. అయితే ఉప్పు విషయంలో ఉండే అపోహలేమిటో చూద్దాం.
ఉప్పును తగు మొత్తంలో తీసుకున్నప్పుడు శరీరానికి కావలసిన పోషకాలు ఏ విధంగా అందుతాయో.. ఎక్కువగా తీసుకున్నప్పుడు అదేవిధంగా ప్రమాదం పొంచి ఉంటుంది..
ఇప్పటికే చాలా ఏళ్ల బట్టి ఉప్పు ఎక్కువగా తింటున్నాం ఏమీ కాలేదు ఇక మీదట ఏమీ కాదు అనుకోవడం కూడా ఆపోహే ఇకమీదటైనా ఉప్పును క్రమక్రమంగా తగ్గించాలి లేదంటే గుండె కిడ్నీలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తగా మానదు. అయోడిసిడ్ సాల్ట్ ఎంత ఎక్కువగా తిన్న ఆరోగ్య సమస్యలు రావు అనుకోవటం కూడా వట్టి అపోహ.. అలాగే వృద్ధులు మాత్రమే ఉప్పును ఎక్కువగా తీసుకోకూడదు మిగిలిన వారంతా తీసుకోవచ్చు అనేది కూడా ఆపోహే.. ఎక్కువగా తీసుకుంటే ఏ వయసు వారికైనా రక్తపోటు పెరిగే అవకాశం ఉంది.. అలాగే వేడి ప్రాంతాల్లో ఉండేవారు ఉప్పును ఎక్కువగా తీసుకున్న చెమట ద్వారా లవణాలు బయటకు పోతాయి కాబట్టి ఏ సమస్య ఉండదు అని అనుకుంటారు కానీ ఇది నిజం కాదు.. ఇలా చేయడం వల్ల శరీరంలో ఉండే నీరు తగ్గిపోవడమే కాకుండా బాడీ డిహైడ్రేట్ అయ్యే అవకాశం కూడా ఉంది.. అలాగే బయట ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి తింటాము కదా ఏం కాదు అనుకుంటాం కానీ ఇది ఎంత మాత్రం సరైన పద్ధతి కాదు దీని వల్ల ఆరోగ్యం ఒక్కసారిగా దెబ్బతింటుంది..