Bhakthi కోహినూర్ వజ్రం.. భారతదేశం నుండి ఎన్నో విలువైన వస్తువులు తరలిపోయాయి.. అందులో ఒకటి కోహనూర్ వజ్రం. అవన్నీ ఎలా అయితే తిరిగి మళ్ళీ రాలేదో.. అలానే కోహినూర్ కూడా వేరే వాళ్ళు చేతుల్లో ఉండిపోయింది.. అయితే ఈ కోహనూర్ వజ్రం పూరి జగన్నాథుడికి చెందవలసిందని.. కానీ అలా కాకుండా బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్లిపోయిందని చరిత్రకారులు నమ్మకం..
కోహినూర్ పుట్టుక కోసం ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు. 14వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో ఈ వజ్రం కొల్లూరు దగ్గర లభించిందని తెలుస్తుంది.. 16వ శతాబ్దంలో ఓ మహిళకు దొరికిందని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఏది నిజం అనేది తెలియదు. ఈ వజ్రం అనేకమంది చేతులు మారి.. చివరికి 1813లో మహారాజా రంజిత్ సింగ్ దగ్గరికి వచ్చిందట. అతను మరణించిన తర్వాత ఆయన కుమారుడు దిలీప్ సింగ్ బ్రిటీష్ వారి చేతిలో ఓడిపోయి.. వారికి ఆ వజ్రాన్ని అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే మహారాజ రంజిత్ సింగ్ పూరి జగన్నాథుడికి కానుకగా ఇవ్వాలనుకున్నట్టు కూడా చరిత్ర చెబుతుంది..
కోహినూర్ వజ్రాన్ని అప్పటి పంజాబ్ మహారాజా రంజిత్ సింగ్ పూరి జగన్నాథుడికి కానుకగా సమర్పిస్తానని చెప్పినట్లు అప్పటి బ్రిటీష్ ఆర్మీ అధికారి నిర్ధారించిన పత్రం ఢిల్లిలోని నేషనల్ ఆర్కైవ్స్ లో స్పష్టంగా ఉంది. అయితే అతను దాన్ని సకాలంలో అందజేయలేకపోయారని, అంతలోనే అతను మరణించారని, ఆ తర్వాత తన కుమారుడు బ్రిటీష్ రాణికి అప్పగించినట్లు సమాచారం.