Health ప్రతి ఒక్కరూ నిత్యం ఉపయోగించి వస్తువుల్లో ఫ్రిడ్జ్ ఒకటి.. వంటగదిలో ఈ వస్తువు లేకపోతే ఎలాంటి పని జరగదు అయితే చాలామంది ఈ ఫ్రిడ్జ్ ను వాడే విషయంలో అజాగ్రత్త వహిస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని తెలుస్తుంది..
ఫ్రిడ్జ్ ను ఉపయోగించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఏ వస్తువులు ఎక్కడ ఉంచాలి? తినే ఆహార పదార్థాలను ఎన్ని రోజులు ఫ్రిజ్లో ఉంచాలి అనే విషయం చాలామందికి తెలియదు ఇలా తెలియకపోవడం వల్ల దీర్ఘకాలంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంది అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు..
ఫ్రిజ్లో కొన్ని వస్తువులను కొన్ని చోట్ల పెట్టాలి.. ముఖ్యంగా పైన ఉన్న ట్రేలో గుడ్లు, పాలు, పాల పదార్థాలు ఉంచాలి.. అలాగే రెండో ట్రేలో తినగా మిగిలిన పదార్థాలను.. మూడో అరలో అంతగా చల్లదనం అవసరం లేని పదార్థాలు పెట్టుకోవాలి. చివరగా కింద డ్రాయర్‌లో కూరగాయలు, పళ్లు వాటికి సంబంధించినవి పూంచాలి అలాగే ఫ్రిడ్జ్ కు పక్కన ఉండే డోర్లలో పానీయాలు మసాలాలు జ్యూస్ లో నీళ్లు వంటివి భద్రపరుచుకోవాలి..
అలాగే ఫ్రిజ్లో కొన్ని పదార్థాలు కొన్ని రోజులే ఉంచాలి అని నియమం ఉంటుంది.. వాటిలో చేపలు, మాంసం: 3 రోజులు, తిన్నాక మిగిలినవి: 1-2 రోజులు, పళ్లు, కాయగూరలు: 3-7 రోజులు వుంచాలి.. అలాగే పాలు: 2-5 రోజులు, బేకరీ, కేకులు, పేస్ట్రీలు: 5 రోజులు, గుడ్లు: 7 రోజులు, సాసులు: 20-30 రోజులు ఉంచాలి..