గీతాగోవిదం, డియర్ కామ్రెడ్ సినిమాలతో మంచి జంటగా పేరుతెచ్చుకున్న రష్మిక, విజయ్ దేవరకొండ ప్రస్తుతం లవ్‌లో ఉన్నారంటూ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. వీరిద్దరూ ఇటీవల ముంబయి ఎయిర్ పోర్ట్‌లో కనిపించడంతో కలిసే మాల్దీవులు వెళ్తున్నారని ఆంగ్ల మీడియా కోడై కూసింది. తాజాగా రష్మిక సోషల్ మీడియాలో ఓ ఫోటో పంచుకుంది. అందులో రష్మిక పెట్టుకున్న కళ్లద్దాలు విజయ్‌వే అని వీరిద్దరూ కలిసే ఉన్నారని అందరూ ఫిక్స్ అయిపోయారు. తాజాగా విజయ్‌తో తన రిలేషన్‌పై రష్మిక స్పందించింది.
ప్రస్తుతం రిలేషన్ షిప్ గురించి ఆలోచించే అంత టైమ్ తనకి లేదని రష్మిక చెప్పింది. ప్రేమ అనేది నేచురల్‌గా పుడుతుందని, దానికి టైం కేటాయించాలని తెలిపింది. రష్మిక ఫ్రెండ్స్ 15 మంది అని వీరింతా టైం దొరికితే ఎంజాయ్ చెస్తామని చెప్పింది. ఇక విజయ్ గురించి మాట్లాడుతూ.. విజయ్ తనకు క్లోజ్ ఫ్రెండ్ అని కెరీర్ పరంగా ఎలాంటి అనుమానాలున్నా విజయ్‌ని అడుగుతా అని చెప్పింది రష్మిక.