Political తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికలు మంచి జోరు మీద సాగుతున్నాయి ప్రతి పార్టీ గెలుపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ప్రచారంలో ఏమాత్రం తగ్గకుండా ముందుకు దూసుకెళ్తున్నాయి.. అధికార తెరాసకు ఏమాత్రం తగ్గకుండా బీజేపీ తన ప్రయత్నాలు కొనసాగిస్తుంది.. అయితే ఈ మునుగోడు ఉపఎన్నికల ముందు భాజపా నేతలకు మరో షాక్ తగిలింది. భాజపా నుంచి మరో నేత కారెక్కనున్నారు. భాజపా నేత, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ తెరాసలో చేరనున్నారు. ఈ మేరకు నిన్న ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆనంద భాస్కర్ భేటీ అయ్యారు. అయితే ఈ సమయంలో ఈ విషయం బాగా కు పెద్ద షాక్ అనే చెప్పాలి..
ప్రగతి భవన్ లో కేసీఆర్ తో భేటీ అయిన భాస్కర్ రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ వేయడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భాజపా చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కుటుంబం నుంచి వచ్చిన తాను .. భాజపా చేస్తున్న ఈ నిర్వాకాన్ని చూస్తూ భరించలేక భాజపాకు రాజీనామా చేస్తున్నానని సీఎం కేసీఆర్తో చెప్పినట్టు సమాచారం. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని.. తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నట్టు రాపోలు చెప్పారు. భారత రాష్ట్ర సమితి ద్వారా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు.