Ram Gopal Varma : ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏం చేసిన సంచలనమే. తాజాగా ఇప్పుడు ఆయన మళ్లీ పాలిటిక్స్ లో వేలు పెట్టారు. వర్మ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా పూర్తిగా రాజకీయ అంశాలపై సినిమాను తెరకెక్కించనట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. దీంతో ఈ సినిమాపై ఎన్నో అనుమానాస్పద చర్చలకు దారితీస్తుంది.
ఆర్జివీ తెరకెక్కించబోయే మూవీ పేరు వ్యూహం. ఏంటి మేస్టారూ… ఇది కూడా బయోపిక్కేనా అని అడక్కముందే… కాదుకాదు అంతకుమించి అంటూ తనదైన స్టయిల్‌లో ఆన్సరిచ్చేశారు. తన వ్యూహం సినిమా రెండు పార్టులుగా రాబోతోందని, దీనికి పొలిటికల్ ఇంపార్టెన్స్ ఉందని క్లారిటీ ఇచ్చారు వర్మ. బయోపిక్‌లో అయినా అబద్దాలుండొచ్చు… రియల్ పిక్‌లో నూటికి నూరు పాళ్ళూ నిజాలే ఉంటాయంటున్నారు వర్మ. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిందే ఈ “వ్యూహం” కధ అంటున్నారు. గతంతో తాను తీసిన వంగవీటి మూవీ నిర్మాత దాసరి కిరణ్… ఈ చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరిస్తారన్నారు.
నేను అతి త్వరలో “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను ..ఇది బయోపిక్ కాదు …బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్.
బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి.— Ram Gopal Varma (@RGVzoomin) October 27, 2022
అలానే ట్విట్టర్ లో ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక.. తాను దాని గురించి ఏం చెప్పట్లేదు అన్నారు వర్మ. వ్యూహం సినిమాతో పొలిటికల్ షాక్ తప్పదని, దాన్నుంచి తేరుకునే లోపే ” శపధం ” అనే సినిమాతో ఎలక్ట్రిక్ షాక్ ఇస్తానన్నారు వర్మ. ఏపీ సీఎం జగన్‌తో భేటీ తర్వాత… వర్మ ఈ ప్రకటన చేయడంతో ఈ రెండు సినిమాలు ఎవరిని టార్గెట్‌గా చేసుకుని తీస్తారు అనే చర్చ షురూ అయింది. ఇప్పటికే చంద్రబాబు, వంగవీటి రంగా, పరిటాల రవి, లక్ష్మీపార్వతి, పవన్ లపై పొలిటికల్ సినిమాలు చేసి చేసిన వర్మ ఈ సినిమాలో ఎవరిని టార్గెట్ చేయబోతున్నారని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.