Crime కామారెడ్డి లో జరిగిన రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయింది ఫోన్ కింద పడిపోయిందని తీసే ప్రయత్నంలో గొడవలు జారిపోయిన రాజును రెస్క్యూటివ్ దాదాపు రెండు రోజులపాటు ప్రయత్నించి కాపాడింది..
ఒక మనిషి ప్రాణం కాపాడటానికి దాదాపు 80 మంది 20 గంటలపాటు శ్రమించారు ఎందుకు తగిన ప్రతిఫలం దక్కింది ఆ మనిషిని ప్రాణాలతో కాపాడగలిగారు తాజాగా కామారెడ్డిలో చోటు చేసుకున్న ఈ సంఘటనలో బాధితుడు రాజు ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.. పోలీసులు రెస్క్యూ టీమ్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి 44 గంటల పాటూ గుహ కింద ఉండిపోయిన రాజును సహాయక చర్యలు చేపట్టి ఎట్టకేలకు ప్రాణాలతో కాపాడారు.. రెండు రోజులు గృహ కిందే నరకయాతన అనుభవించిన రాజు చివరికి మృత్యుంజయుడుగా బయటకు వచ్చాడు.. దీనికోసం రెస్క్యూటివ్ 20 గంటల పాటు తీవ్రంగా శ్రమించింది.. దాదాపు 80 మంది అధికారులు ఇందుకోసం 20 గంటల పాటు శ్రమించారు..ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి వీరంతా రాజును ప్రాణాలతో కాపాడారు అతనికి ఎలాంటి గాయాలు అవ్వకుండా జాగ్రత్తగా బయటకు తీయడానికి ఎంతగానో తాపత్రయపడ్డారు ఆహారం లేకపోవడంతో అతనికి నీరు ఓఆర్ఎస్ అందించారు.. ఫ్లూయిడ్స్‌ను అందించారు. జిలెటిన్ స్టిక్స్‌తో వరుసగా బ్లాస్టింగ్స్ చేశారు. ఆ తర్వాత రాజుకు అడ్డుగా ఉన్న బండరాళ్లను తొలగించడంతో రాజు కాళ్లు బయటకు కనిపించాయి. దీంతో రాజును జాగ్రత్తగా బయటకు తీసుకువచ్చారు రెస్క్యూ టీమ్.. దీంతో బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డాడు కాగా రాజుకు పెళ్లయి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు..