Movie తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మణిరత్నం కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్నట్టు సమాచారం ఇదే నిజమైతే మీరు ఫ్యాన్స్ కు ఇది పండుగనే చెప్పొచ్చు…
దాదాపు 30 ఏళ్ల క్రితం మణిరత్నం రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన దళపతి సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే.. సెన్సేషనల్ క్రియేట్ చేసిన ఈ సినిమా దాదాపు అన్ని భాషల్లో వంద రోజులు ఆడింది అరవిందస్వామి శోభనా రజినీకాంత్ నటించిన ఈ చిత్రం అప్పట్లో ఓ సంచలనం అనే చెప్పాలి సినిమా అంత సూపర్ హిట్ అయినప్పటికీ మళ్లీ వీరిద్దరూ కాంబినేషన్లో సినిమా రాలేదు అయితే దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ మనురత్నం రజనీకాంత్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుందని తెలుస్తోంది..
ప్రస్తుతం రజనీకాంత్ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో రెండు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఇందులో ఒక చిత్రానికి చక్రవర్తి దర్శకత్వం వహించగా మరో చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది తాజాగా మనురత్నం తీసిన పాన్నియన్ సెల్వన్ 1 మూవీ మంచి హిట్ టాక్ అందుకుంది.. అంతేకాకుండా కలెక్షన్లు పరంగా కూడా దూసుకుపోతున్న ఈ చిత్రానికి త్వరలోనే సీక్వెల్ రాబోతుందని సమాచారం.. అయితే మరి ఈ సినిమా సీక్వెల్ ముందుగా పట్టా లెక్కిస్తారో లేదా రజినీ
కాంత్ తో చిత్రాన్ని చేస్తారో చూడాలి మరి.. అయితే అసలు విషయం ఏంటనేది తెలియాలి అంటే కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే..