Entertainment దర్శకధీరుడు రాజమౌళి త్వరలోనే ఆర్ఎస్ఎస్ సినిమాను తెరకెక్కించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన కథను ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేసి ఉన్నారు. అయితే తాజాగా దాని న్యూయార్క్ ర్ రాజమౌళి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు..
ఆర్ఆర్అర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయికి టాలీవుడ్ ను తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. త్వరలోనే ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ను గెలుచుకోని ఉందని అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక విదేశీ పత్రిక రాజమౌళిని ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆయనను పలు ఆసక్తికర విషయాలు ప్రశ్నించగా అన్నిటికీ తనదైన శైలిలో సమాధానాలు చెప్తూ వచ్చారు అలాగే విజయేంద్ర ప్రసాద్ ఆర్ఎస్ఎస్ కథను సిద్ధం చేశారు దీనిపై మీరు ఏమంటారు అని ప్రశ్నించగా.. “ఆర్.ఎస్.ఎస్. గురించి నాకు సరైన అవగాహన లేదు. ఆ సంస్థ గురించి విన్నాను కానీ అది ఎలా మొదలైంది.. ఏ రకంగా విస్తరించింది అనే విషయాలు నాకు పెద్దగా తెలియవు. అయితే నాన్న అర్ ఎస్ ఎస్ గురించి రాసిన స్ర్కిప్ట్ చదివా. ఎమోషనల్ స్టోరీ అది. చదువుతూ చాలా సార్లు నాకు తెలియకుండానే ఏడ్చేశా.. అయితే ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తున్నారో నాకు అస్సలు తెలీదు. కానీ కథ చాలా ఎమోషనల్‌గా ఉండడంతో నాకు బాగా నచ్చేసింది. వేరే సంస్థ కోసమో, నిర్మాత కోసమో నాన్న తయారు చేసిన కథ అది. అయితే ఆ కథను డైరెక్ట్ చేసే అవకాశం నాకు వస్తే అదో గౌరవంగా భావిస్తా. మానవతా విలువలు, బలమైన భావోద్వేగాలు కలిగిన కథ కావడమే దీనికి కారణం.. ” అంటూ చెప్పుకొచ్చారు..