Entertainment నిజానికి ఇప్పుడు ఉన్న సమాజం కులం పైనే నడుస్తుందని చెప్పవచ్చు అన్ని చోట్ల కాకపోయినా చాలా చోట్ల మాత్రం కులం ఆదిక్యం ఎక్కువగానే ఉంది ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో కులప్రస్తావన ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటుంది తన కుటుంబానికి అవకాశాలు ఇస్తారు అంటూ ఎప్పటినుంచో వాదన ఉంది అలాగే కొన్ని రకాల కులాలు సినీ ఇండస్ట్రీని పాలిస్తున్నాయని అంటూ ఉంటారు అయితే తాజాగా ఈ విషయంపై స్పందించారు రాజమౌళి..
దర్శక ధీరుడు రాజమౌళి తాజాగా కులం పై స్పందించారు. అర్ అర్ అర్ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిన సంగతి తెలిసిందే ముఖ్యంగా ఈ సినిమా ఆస్కార్బరిలో సైతం నిలిచింది అయితే తాజాగా భారతదేశంలోని కుల వ్యవస్థ గురించి ప్రముఖ హాలీవుడ్ మీడియా అడిగిన ప్రశ్నకు రాజమౌళి.. ”నా కుటుంబ సభ్యులు కుల వ్యవస్థకు వ్యతిరేకం. నిజానికి నా కాలేజీకి వెళ్లే వరకు నా కులం ఏమిటో కూడా నాకు తెలియదు. ఇప్పటివరకు కులం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం కూడా రాలేదు. నా దరఖాస్తు ఫారమ్ నింపడానికి మా నాన్నగారు వచ్చారు. కులం గురించి అందులో ఒక కాలమ్ కూడా ఉంది. నాన్న దానిని పూరించడానికి నిరాకరించాడు. కుల వ్యవస్థ గురించి నాకు మొదటిసారి అప్పుడే తెలిసింది.. ” అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి.
అయితే కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ హీరో జగతిబాబు సైతం కుల ప్రస్తావన విషయంపై మాట్లాడిన సంగతి తెలిసిందే.. తనకు కులంతో పట్టింపులు లేవని కానీ చుట్టూ ఉన్నవారు మాత్రం ఎప్పుడు పట్టించుకునే ఉంటారని చెప్పారు ఇంట్లో పని చేసే పనిమనిషి ఏ కులం అని ఎవరు ప్రశ్నించారు నా కూతురు అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు కులానికి సంబంధించి ఇబ్బందులు ఎదురయ్యాయి కుల పెద్దలంటూ కొందరు బెదిరింపులకి దిగారు అంటూ చెప్పకు వచ్చారు అప్పట్లో ఈ విషయం వైరల్ గా మారింది ప్రస్తుతం రాజమౌళి మళ్లీ ఇదే విషయంపై మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.