Politics భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న రాహుల్ గాంధీ… ఇటీవల కాలంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు వరుసగా పార్టీని విడుస్తుండడంపై ఘాటుగా స్పందించారు. పార్టీనీ విడిపోతున్న నాయకులంతా అధికార బీజేపీతో సందికుదుచ్చుకున్న వాళ్లేనని రాహుల్ అన్నారు వీళ్లంతా వాళ్లు నమ్మిన సిద్ధాంతాలను వదిలి వెళ్ళిపోతున్నారని వ్యాఖ్యానించారు అయితే వాళ్లలో చేతులు జోడించడం తనకు రాదని తనది అసలు అలాంటి స్వభావమే కాదని అన్నారు.. తనది పోరాట పంథా అంటూ చెప్పారు..పోరాటం విడిచి పెట్టే ప్రసక్తి లేదని అన్నారు. తరతరాలుగా భారతదేశ అభిమానానికి తను కట్టుబడి ఉన్నానని అన్నారు. భారత దేశ భావన కోసం తాను పోరాడతానన్నారు.
దేశంలోని అన్ని వ్యవస్థలను అధికార భారతీయ జనతా పార్టీ తన స్వాధీనంలోకి తెచ్చుకుందని ఆరోపించిన రాహుల్… ఇటీవల గులాం నబీ ఆజాద్ వంటి నేతలు పార్టీని వీడుతుండటంపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీలు వీడుతున్న నాయకుల్ని తను ఆపలేనని వారిపై ఒత్తిడి పెంచడం తన వల్ల అయ్యే పని కాదని అన్నారు ఇలాంటి నాయకులపై ఒత్తిడి పెంచగలిగే శక్తి సామర్థ్యం కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉన్నదని రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యా కుమారిలో ప్రారంభం కాగా….. ఈ యాత్రలో కాంగ్రెస్ నేతలు బస చేసేందుకు దాదాపు 60 కంటెయినర్లను ఉపయోగిస్తున్నారు.