Politics భారత్ జూడో యాత్రలో భాగంగా తమిళనాడులో పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఈ పాదయాత్రలో భాగంగా ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్న రాహుల్ గాంధీ దేశంలో యువత ఎంతగా నిరుద్యోగంతో బాధపడుతున్నారో వివరించారు. ఈ క్రమంలోనే అవకాశం దొరికినప్పుడల్లా… కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
దేశంలో 42 శాతం మంది యువత నిరుద్యోగంతో బాధ పడుతోందన్న రాహుల్ గాంధీ… ఇలాంటి పరిస్థితుల్లో దేశ భవిష్యత్తు సురక్షితమే నా..? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ములుగుమేడులో రాహుల్ పర్యటనలో పాల్గొన్న కొంత మంది యువత ‘ఐయాం వాకింగ్ ఫర్ జాబ్’ అని ముద్రించిన టీ షర్టులు ధరించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కష్టాల విన్న రాహుల్… దేశంలో నిరుద్యోగ సమస్య గురించి ట్వీట్ చేశారు. భారత్ జోడో యాత్ర సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యా కుమారిలో ప్రారంభం కాగా….. ఈ యాత్రలో కాంగ్రెస్ నేతలు బస చేసేందుకు దాదాపు 60 కంటెయినర్లను ఉపయోగిస్తున్నారు. తమిళనాడులో నాలుగు రోజుల పాదయాత్ర ముగియగా…ఆదివారం నుంచి కేరళలో పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్కడ 18 రోజుల పాటు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది.
వివాదాస్పద మతబోధకుడితో భేటీయా?: బీజేపీ
పాదయాత్ర భాగంగా వివిధ వర్గాలను కలుస్తున్న రాహుల్.. వివాదాస్పద క్రైస్తవ మతబోధకుడు జార్జ్ పొన్నయ్యతో భేటీ అయ్యాడు. వీరిద్దరి భేటీకి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా… ఈ విషయంపై అధికార బిజెపి పార్టీ విమర్శలు గుప్పించింది