Political కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జూడయాత్రలో భాగంగా ఈరోజు ఏపీలో అడుగు పెట్టారు.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాధ్ తో పాటుగా మాజీ మంత్రి రఘువీరా రెడ్డి ఆయనను సాదరంగా ఆహ్వానించారు..
వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాహుల్ గాంధీ ఏపీ పర్యటన చేయటం ఇదే మొదటిసారి చాలా ఏళ్లు కాంగ్రెస్ లోనే కొనసాగిన జగన్ తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం కొన్ని విభేదాలు ఆ పార్టీలో తలెత్తడంతో బయటకు వచ్చారు తనను ముఖ్యమంత్రి చేయలేదని జగన్ పార్టీ నుంచి బయటకు వచ్చారని వార్తలు వినిపించాయి ఆ తర్వాత జగన్ వైఎస్ఆర్సిపి పార్టీని పెట్టి 2014లో ఓటమి చవిచూసిన 2019లో మంచి విజయాన్ని అందుకొని ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రెండు లోక్ సభ ఎన్నికల్లో చేతికిలపడి అధికారాన్ని కోల్పోయింది.. అయితే ఈ భారత్ జూడయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఏపీకి వచ్చారు.. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలోని డీ హరేల్ మండలంలో మారెమ్మ గుడి వద్ద కర్ణాటక-ఏపీ సరిహద్దు గుండా ఆయన ఏపీలోకి ప్రవేశించారు..
ఈ యాత్రలో భాగంగా మూడు కిలోమీటర్ల దూరం ఏపీ సరిహద్దుల్లో రాహుల్ పాదయాత్ర సాగగా… ఆ తరువాత ఆయన తిరిగి కర్నాటక బళ్లారి మీదుగా అక్కడ ప్రవేశిస్తారు. మళ్లీ ఈ నెల 17న మరోసారి ఏపీలోకి ప్రవేశించి వారం రోజుల పాటు పాద యాత్ర చేస్తారు.. అయితే ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం పై రాహుల్ గాంధీ విమర్శలు గుర్తించే అవకాశం కనిపిస్తోంది..