రాచకొండ కమిషనర్ శ్రీ డిఎస్ చౌహాన్ ఐ.పి.ఎస్ గారు, రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న తొంభై తొమ్మిదేళ్ల వయోధిక మాజీ సైనికోద్యోగి ఎన్ . సత్యనారాయణ, తమ చిన్న కొడుకు వల్ల ఎదుర్కొంటున్న సమస్యల మీద ఇచ్చిన ఫిర్యాదును మానవీయ కోణంలో రాచకొండ కమిషనరేట్ ఆఫీస్, నెరేడ్ మెట్ లో స్వయంగా సీపీ క్యాబిన్ బైటకు వచ్చి ఫిర్యాదును స్వీకరించారు.
అనంతరం స్పందించి తక్షణమే విచారణ జరిపి వారికి తగిన న్యాయం చేయాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. మహిళలు, వృద్ధుల పట్ల అమానుషంగా వ్యవహరించే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్బంగా ఆయన హెచ్చరించారు.
పోలీస్ స్టేషన్ కు స్వయంగా రాలేని బాధితులు రాచకొండ వాట్సాప్ కంట్రోల్ రూమ్ 9490617111 నంబర్ కి గానీ, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా తక్షణమే స్పందించి బాధితులకు సత్వర న్యాయం చేకూరుస్తామని ఈ సందర్బంగా కమిషనర్ తెలిపారు.