Health గర్భం దాల్చిన దగ్గర్నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి అందులో ముఖ్యంగా తినే ఆహారం విషయంలో మాత్రం ఎలాంటి జాగ్రత్త వహించకూడదు. అయితే వీరు కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు..
గర్భంతో ఉన్నప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల శిశువు ఎదుగుదలపై ప్రభావం ఉంటుందని తెలుస్తోంది అలాగే కలుషిత ఆహారం కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు దీర్ఘకాలం వేధించే ఎన్నో సమస్యలు పిల్లల్ని వెంటాడుతాయని తెలుస్తోంది..
అందులో ముఖ్యంగా మురికి నీటిలో పెరిగిన చేపలకు మాత్రం దూరంగా ఉండాలి ఇలా పెరిగిన చేపల్లో మెర్క్యూరీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దీని వలన బిడ్డ నాడీ వ్యవస్థ ఎదుగుదల సక్రమంగా ఉండదు. అందుకే వీలైనంత వరకు వీడికి దూరంగా ఉండాలి.. అలాగే పచ్చి మాంసం పచ్చి చేపలు సగం ఉడికించిన గుడ్డు ఇలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే మాంసాహార పదార్థాలు సగం సగం వండినప్పుడు వీటిలో ఉండే బ్యాక్టీరియా సూక్ష్మ క్రిములు పూర్తిస్థాయిలో నశించవు ఇవి గర్భిణీ స్త్రీలకు హాని చేస్తాయి.. అలాగే టిఫిన్ కంటెంట్ తక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలి వీలైనంతవరకు కాఫీ టీలకు దూరంగా ఉండటమే కాకుండా స్వీట్స్ ను కూడా ఎక్కువగా తీసుకోకూడదు.. అలాగే ఈ సమయంలో ఆల్కహాల్ను తీసుకోకపోవడం మంచిది అలాగే బయట దొరికే అన్ని రకాల జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.. అలాగే పచ్చికాయ కూరగాయలు, సరిగ్గా ఉడికించని ఆహార పదార్థాలు, కడగని పండ్లు వంటి వాటికీ దూరంగా ఉండటం మంచిది..