ముగ్గురు మూడు చీటీలేసి.. ఆ మూడింట్లో ఎవరికి ఏ చీటీ వస్తే ఆ పాయింట్ ని పట్టుకుని మూవీ తీస్తే ఎలా ఉంటుందీ ??? అని చూస్తే మూర్తి దేవగుప్తాపుకు వచ్చిన చీటీ..
*అధికార దాహం కొద్దీ తండ్రిని చంపిన తనయుడు* ఈ పాయింట్ మీద సినిమా తీయమని చెప్పి.. బాబు అండ్ కో కావచ్చు.. ఎల్లో మీడియా అధిపతులు కావచ్చు.. జర్నలిస్ట్ మూర్తికి అప్పగించినట్టు తెలుస్తోంది.. దీంతో కంబ్రా అయిన మూర్తి.. ఈయన కమ్మ\ బ్రాహ్మణ కాంబో అ*ట*.. (ఎవరో నాకిది చెప్పడాన్ని బట్టీ.. నేను కూడా ఆయనలోని.. కమ్మోత్సాహం బాగా చూడ్డాన్ని బట్టీ ఈ పద ప్రయోగం చేస్తున్నా.. తప్పయితే క్షమించగలరు) తన స్క్రీన్ ప్లే మొత్తం రంగరించినట్టుగా తెలుస్తోంది.
ఓకే.. ఇందులో మూర్తి ఎంత వరకూ సక్సెస్ సాధించినట్టు ??? అంటే ఫస్ట్.. సినిమా డిమ్ లైట్ లో చూసినట్టు గా ఉంది.. తన స్టూడియో ప్రొగ్రామ్స్ విషయంలో ఎంతో లైటింగ్ టాలెంట్ ప్రదర్శించే మూర్తి ఈ మూవీ లైటింగ్ లో ఎందుకో వెనకబడ్డట్టు తెలుస్తోంది.. లేకుంటే డీఐ వంటివి ఏవో చేయించడం వదిలేసినట్టు ఉంది.. దీంతో కమ్మగా తీసిన ప్రింటు చాలా చాలా డిమ్ము గా అని\కనిపించింది..
ఇంతకీ ఒక జర్నలిస్టిక్ డైరెక్టర్ (సారీ క్షమించండి.. ఈయన్ను పదే పదే జర్నలిస్టు అంటున్నందుకు చాలా తీవ్రంగా బాధ పడేవాళ్లు ఉండొచ్చు. మరీ ముఖ్యంగా ఆయన దురాభిమానులు. ఎందుకంటే.. ఒక సైడు తీస్కుని సైకిల్ బండి లాగిస్తున్న మూర్తి ఏమిటి ? జర్నలిస్టు కావడమేంటని ?? నాకు ఇది వరకే తలంటు పోశారు ఈయన సమకాలీనులు. అది వేరే విషయం. అదెప్పుడంటే… ఈయనపై కేసులు పెట్టి తిప్పుతున్న టైంలో నేను ఈయనకు ఐ స్టాండ్ విత్ మూర్తి అంటూ కథనాలు రాసినపుడు).
అదలా ఉంచితే.. డైరెక్టర్ అనే హాట్ సీట్ లో మూర్తి బాగానే సిట్ కమ్ సెట్ అయ్యారా ? అంటే
ఇక్కడ తీత విషయంలో ఒక డైరెక్టర్ గా ఒకింత అనుభవం సాధించినట్టుగానే చెప్పాలి.. అలాగని అయన తన స్టార్టింగ్ క్రెడిట్స్ లో వేసుకున్నట్టు.. సుకుమార్ అంతటి డైరెక్టర్ ఏం కాదు… కాలేరు కూడా.. ఎందుకలా ??? అంత భారీ కామెంట్ చేయడానికి గల కారణాలేమై ఉంటాయ్.. అని అడగొచ్చు కొందరు.. రియల్ గా చూస్తే మూర్తి నాటి వైయస్ఆర్ మీద అభిమానం ఉండీ లేనట్టుగా తీసిన ఈ సినిమా (చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ) ఆయన మరణానికి సంబంధించిన పాయింట్ ని తన ఎంగేజింగ్ టాపిగ్గా ఎంపిక చేసుకున్నాడు.
నిజంగా చెబితే డైలీ ఆంధ్రజ్యోతి\ఈసాడు\టీవీ5\ మహా వంటి ఛానెళ్లు చూసే వారికి ఇదో చిత్ర రాజం.. లైక్ గుండమ్మ కథ, నర్తనశాల, మాయాబజార్ అంత సమ్మగా ఉండొచ్చు. కానీ ఇవన్నీ తెలిసిన నీ\నాబోంట్లకు మాత్రం చుర చుర కాలుతుంటుంది.. వీడూ వీడి పైత్యం అంటూ తిట్టుకోవడం..హాల్లో కూడా కని\వినిపిస్తుంటుంది. కొందరైతే ఆ బోరింగ్ కమ్ లాగ్ మెటీరియల్ ని తిప్పి తిప్పి చూపించే విధం నచ్చక బయటకు వెళ్లిపోవడం.. లేదంటే ఆన్ లైన్ పేకాట ఆడుకోవడం కనిపించింది (వచ్చిందే నలుగురు ఆ నలుగురులోనూ ఎవరికి వాళ్లు చతుర్ముఖ పారాయణమా.. హతమూర్తీ!)
ఇదిలా సాగితే ఒక రియల్ జర్నలిస్టు- రీల్ డైరెక్టర్ అయిన సందర్భంగా వచ్చిన ఈ సినిమా రియల్ సినిమా అయితే కాదు. ఇందులోంచి కొత్త పాయింట్ ని ఆశించడం అంతకన్నా మించిన అత్యాశే అవుతుంది. ఇక మిగిలింది.. డ్రామా ఎలా సాగింది.. అని చెప్పుకోవడం. స్క్రీన్ ప్లే మాటేంటని.. ఆరా తీయడం. నాకు తెలిసి మూర్తికి.. వైయస్ఆర్ కీ మధ్య ఏవో చాలా చాలా దారుణమైన కక్షలు\ కార్పణ్యాలు దాగి ఉన్నట్టు కొడుతోంది.. తన చిన్నప్పుడు వైయస్. లేదా ఆయన పార్టీ లీడర్ల కారణంగా మూర్తి చాలా చాలా దారుణంగా నష్టపోయినట్టు గా తెలుస్తోంది.
ఆ కక్ష కొద్దీనో లేక మరొకటో తెలీదు కానీ.. 2018లోనే ఫేడవుట్ అయిన నారా రోహిత్ లో తన జర్నలిజం అంతా రంగరించి.. తన అంతటి జర్నలిస్టుగా చూపించే యత్నం చేయడం తెలుగు సినిమా రంగ చరిత్రలోనే ఒక మైలు రాయి, మేలి మలుపుగానూ అనిపించింది.. బేసిగ్గా నారా రోహిత్- అతడి సినిమాల వెనక రూ. 300 కోట్ల మేర భారీ స్కామ్ జరిగిందని అంటారు.. అతడి సినిమాలేవీ ఆడక పోయినా.. వరుస వెంబడి సినిమాలు తీయడం వెనక బ్లాక్ ని వైట్ చేయడం అనే ఒక ప్రక్రియ ఉన్నట్టు మొన్నా మధ్య ఒక వార్త హల్ చల్ చేసింది.. దీనంతటి వెనక చంద్రబాబు హస్తం ఉందన్న మాట కూడా వినిపించింది (బహుశా జర్నలిస్టు సాయి ద్వారా అనుకుంటా)
ఇప్పుడిదే సినిమా గురించి.. ఫ్లైట్ లో బాబు చేత చెప్పించడం చూసి.. ఓహో ఇది అదేనా ??? అని లైటు వెలిగేలా చేసింది. (ఇది మన తప్పు ఎలా అవుతుంది. దానికి తోడు మీకు ఫండ్ సప్లై చేస్తోంది బాబేనా ? అని ఒక యాంకరమ్మ చేత అడిగిస్తే తానే బాబుకు, పవన్ కి రోజూ పాలపేకట్లు కొనడం, సినిమాలు చూడ్డం ద్వారా ఎదురు నిధులు అందిస్తున్నానని అన్నాడు… స్వయానా మూర్తి. అది వేరే సంగతి. ఇప్పుడు తన తాజా చిత్రం ద్వారా జగన్ కి విజయాన్ని కూడా అందిస్తాడని ఎవరో అంటే విన్నా.. ఇది మరో సంగతి లెండి)
ఇక ఈ సినిమా ద్వారా మనకు కొత్తగా తెలిసేదేదీ ఉండదు. దీని పర్పస్.. వేరే. వ్యూహం ద్వారా వర్మ వైయస్ మరణం తర్వాత జగన్ ఎదుర్కున్న వ్యూహ ప్రతివ్యూహాలను ఎలా చేధించాడో చూపిస్తే.. అసలు వైయస్ మరణం వెనక ఉన్నదల్లా.. జగన్ వ్యూహమే.. అన్నది ఎత్తి చూపాలని చాలా చాలా తాపత్రయ పడినట్టు కనిపించింది.. అప్పట్లో ఇదే టీవీఫైవ్ ప్రధాన యాంకర్ గా పని చేసిన వెంకట కృష్ణ సైతం ఇలాంటి పాయింటే ఒకటి రైజ్ చేసి.. కేసులు గట్రా ఎదుర్కోవడం అదో సంచలనం. ఆ పాయింట్ ని ఇంకాస్త డెలాబరేట్ గా చెప్పించాలని అనుకున్నారో లేక.. ఈ పీక్ టైంలో జగన్ తన తండ్రిని చంపిన నీచుడన్న ఎస్టాబ్లిష్ మరో రీజనో తెలీదు కానీ.. మొత్తం మీద.. V. చిత్రమైన యత్నమైతే ఒకటి నమోదయ్యింది.
దీన్నిబట్టీ మనకేం అర్ధమవుతుందంటే.. జగన్ కి తన తండ్రి మరణానికి ముందే ప్రశాంత్ కిషోర్ తో పరిచయముందని… అతడిచ్చిన సలహా వల్లే.. జగన్ పెద్ద తలకాయను లేపడానికి ప్రయత్నించినట్టుగానూ తెలుస్తుంది. మాములుగా ఇలాంటి సింపతీ/ సెంటిమెంట్లే వర్కవుట్ అయ్యే పనైతే.. అలనాటి అలిపిరి ఘటన తర్వాత బాబు ఎందుకు గెలవలేదు ??? అంటే బహుశా మూర్తిలోని జర్నలిస్టిక్ డైరెక్షనల్ డైమన్షన్ కి బహుశా ఆన్సర్ తట్టదేమో.
సరే ఇదాయన వండిన వంటకం.. మనం తగిన రీతిన గౌరవించాల్సి ఉంటుంది కూడా. ఎంతైనా ఆయన మాజీ జర్నలిస్టు కదా ??? సారీ సారీ.. ప్రెజంట్ కూడా ఆయన జర్నలిస్టే.. ఆయన ఈ రకంగా తన సోషల్ మీడియా అకౌంట్లలో ఎక్స్ పోజ్ చేసుకుంటారు కూడా.. (నాదృష్టిలో ఇలా జర్నలిస్ట్ అని పేరు చివర్న రాసుకునేవాళ్లలో.. వాళ్లకే తాను జర్నలిస్టు అని చెప్పుకుంటే కానీ జనం నమ్మరన్న ఒక అపనమ్మకం ఉండాలి. ఆ మాటకొస్తే జర్నలిస్టు సాయి, రఘు లేరా !? అని మీరడగవచ్చు)
ఇక మూర్తి ఈ సినిమా కొంత కంగాళీగా ఉంటుందని తనలో తనకే అనుమానం వచ్చినట్టుంది.. దీన్ని కవర్ చేయడానికి గానూ.. ఆయన మరో సివరాఖరాస్త్రం ప్రయోగించారు.. ప్రస్తుతం తాను వండి వార్చిన ఈ కఠ్టు కతలో ఎన్నో డౌట్స్ మీకు రావచ్చునని.. ప్రతినిథి- 3 లో మీకు ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తానని.. టీవీ5 వేదికగా.. మనందరికీ కాస్త ఊరటనిచ్చిన మాట వాస్తవం. (ఇంకా నయం బోయపాటిలాగా ఫస్ట్ లోనే వచ్చి ఇదంతా చెప్పి ఉంటే.. మనం మరింత కంగారు పడిపోయేవాళ్లం)
ఇదే మూవీలో నాకు ఉదయభాను చేసిన (అదురుకున్నట్టు చేసినది) నటన చాలా చాలా బాగా నచ్చింది. అలాంటి సహజ నటి నుంచి కూడా ఇలాంటి అస(హజ)మాన నటన రాబట్టడం.. బహుశా బాలయ్య బాబును సైతం ఆశ్చర్య చకితం చేయవచ్చనుకుంటా !!! ఇక నారా రోహిత్ గురించి మాట్లాడుకుంటేనే చాలా చాలా బాధనిపిస్తుంది. ఆయన ఎప్పటిలాగానే. మా పెదనాన్న- సీఎం అన్నంత కాన్పిడెంట్ గా నటించుకుంటూ వెళ్లాడు. విచిత్రమైన విషయమేంటంటే.. సంక్రాంతి సంబరాల్లో నారావారి పల్లెలో నారా వారింట ఒక్కసారంటే ఒక్కసారి కూడా నారా రోహిత్ అనే ఈ కుర్రాడు కనిపించనే కనిపించడు. ఇదేం విడ్డూరమో అర్ధం కాదు. తన తండ్రి నిజంగానే పిచ్చి వాడని పెదనాన్న చెప్పమన్నట్టల్లా చెప్పేస్తుంటాడు అప్పటికీ. బహుశా.. నీకంటూ ఒక సినీ ఇమేజ్ తీసుకొచ్చే బాధ్యత నాది.. మిగిలినదంత నేను ఆడమన్నట్టల్లా ఆడు అని బాబుగారి మాయోపాయం కావచ్చు.. (ఎవరో అంటే విన్నా)
ఇదిలా ఉంటే.. మూర్తి ఇకపై కమర్షియల్ డైరెక్టర్ అయిపోవచ్చా ??? అంతగా ఆయన స్క్రీన్ ప్లే వరద పారించాడా ? బిగ్ స్క్రీన్ వండర్ క్రియేట్ చేశాడా ? అని చూస్తే.. ఇలాంటి సస్పెన్స్ త్రిల్లర్ సినిమాలను తీయడానికి సపరేట్ స్కిల్స్ ఉంటాయ్. అవి మూర్తిలో ఉన్నాయా ? అంటే ఇంకా అంత మెచ్యూరిటీ లెవల్స్ రావడం లేదనే చెప్పాలి. ఇలాంటి కథలతో కట్టి పడేయటం కూడా ఒక విద్య. జైలర్ సినిమానే తీస్కోండి. అది కూడా దాదాపు ఇలాంటి సీరియస్ సబ్జెక్టే కానీ.. ఆ దర్శకుడు నడిపించినంత ఎంటర్టైనింగ్ గా హ్యాండిల్ చేయడానికి తగినంత ప్రాక్టీస్ మూర్తి డైరెక్షనల్ స్కిల్ కి వున్నట్టే కనిపించదు.
దానికి తోడు నిర్మాతలు చెప్పిన వాళ్ల చేత కెమెరా పట్టించి, మ్యూజిక్ కొట్టించినట్టుంది.. కృష్ణానగర్ ఎల్ బోర్డ్ బ్యాచే.. ఈ రెండు విభాగాలను చాలా చాలా చక్కగా చేపట్టి ఉండేవాళ్లు.. ఇదసలే కమ్మ.. యూనిటీ నుంచి తయారైన సినిమా కావడం వల్లేమో.. విభాలన్నిటినీ లాబీయింగ్ ఎక్స్ పర్ట్స్ కి అప్పగించేసినట్టున్నారు.. వాళ్లు.. పాటలంటే పాటల్లాంటివి, ఆర్ ఆర్ అంటే ఆరార్ లాంటిది.. కెమెరాపనితనం అంటే అలాంటి అర్ధమొచ్చేలాంటిది.. అందించినట్టున్నారు. ఫాపం మూర్తి మాత్రం ఏం చేస్తాడు ???
మూర్తికి సిని పరిజ్ఞానం లేదా ? అంటే ఉందండో..!!! కృష్ణానగర్ కతలు అననుకుంటా.. ఒక ప్రొగ్రాం చేయించాడు. ఆపై నేను ఏబీఎన్ లో పని చేస్తున్న రోజుల్లో హౌ రొమాంటిక్ అనే వీక్లీ సీరీస్ చేశా. ఇందులో భానుప్రియ ఎపిసోడ్ తనకు చాలా చాలా నచ్చిందని ఆయన అనడం నాకు దక్కిన గౌరవంలాంటి – గౌరవం. తర్వాత నా ఎపిసోడ్స్ వచ్చే స్లాట్ లో మూర్తిగారి మన బడి పిస్తోంది (బహుశా అదే పేరనుకుంటా).. అనే కార్యక్రమం వచ్చి చేరింది.. ఓహో ఈ బిస్కెట్ ఇందుకా? అని నాకు అప్పుడనిపించింది అది వేరే విషయం అనుకోండి..(ఎంతైనా తాను ఒంటబట్టించుకున్న లౌక్యం అలాంటిది మరి)
ఇక బిస్కెట్లు అంటే గుర్తుకొచ్చింది.. సంక్షేమం అనే బిస్కెట్లు వేసేశాం.. అంటూ కొన్ని డైలాగులు యాంటీ జగన్ గవర్నమెంట్ గా పలికించి.. ఈ ఎన్నికల సీజన్ కి తన వంతుగా జనాన్ని పిచ్చోళ్లను చేసే ప్రక్రియను ఎంతో విజయవంతం చేసిన ఘనత దక్కించుకున్నారు మన మూర్తివర్యులు. ఈ వియంలో ఆయన జర్నలిస్టా? లేక దర్శకుడా?? అని మాత్రం అడక్కండి.. ఆయన ఎల్లో మీడియా జర్నలిజానికి సెకెండ్ గ్రేడ్ వారియర్. (ఫస్ట్ గ్రేడ్ ఆర్కే తదితరులున్నారుగా.. ఇప్పట్లో ఈ హోదా ఎలాగూ దక్కదు కానీ..) ఆయన ఆ మాత్రం ఎల్లోమీడియాధిపత్యం వహించే ఎర్న.. సారీ జర్నలిస్ట్ కావడం వల్లే.. డైరెక్టర్ అనే హోదా దక్కింది కాబట్టి.. అర్ధం చేసుకోగలరని మనవి.
ఏంట్రా బాబూ నీకింత దుగ్ధ.. ఒక జర్నలిస్టు, డైరెక్టర్ గా ఎదుగుతుంటే ఓర్చుకోలేవే.. అని మీరంటారు కావచ్చు.. అన్నట్టు మరిచే పోయే.. మూర్తి నేను ఇద్దరం సారీ, మూర్తిగారూ నేనూ ఇద్దరం ఒకే గదిని పంచుకుంటూ ఏబీఎన్ లో పని చేశాం. అబ్బో అదో పెద్ద కథలేండి! ప్రతినిథి- 3 రిలీజపుడు మాట్లాడుకుందాం..
(ఇంతకీ ప్రతినిథి మూడో భాగం వస్తుందంటారా? అని మీకో డౌటనుమానం రావచ్చు. ఈసారికి బాబు వస్తే రాదు. లేకుంటే ఆ ఖళా ఖండ ఖండం తప్పకుండా వస్తుందని మీరు ఫిక్సయిపోండి.. మిగిలింది నే జూస్కుంటాగా… !!!)