PCC President N Uttam Kumar Reddy Comments on CM KCR, Nagarjuna Sagar by Elections
టీ.ఆర్.ఎస్ అధికార మదంతో అక్రమాలతో దుష్ట పాలన సాగిస్తోంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
గిరిజనుల పోడు భూముల సమస్యలను చెప్పడానికి సీఎం కేసీఆర్ సభకు వస్తే గిరిజన మహిళలను కుక్కలతో పోల్చారు.
టీ.ఆర్.ఎస్ నేతలు కళ్లు నెత్తికెక్కి మంత్రి మల్లారెడ్డి బహిరంగంగా వసూల్ చేస్తున్నారు.
మంత్రి మల్లారెడ్డి ని ఎందుకు భర్తరఫ్ చేయడం లేదో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలి.
నలుగురు ఎమ్మెల్యేలు బెంగళూరు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు.
తెలంగాణ పరువు తీసిన ఈ నలుగురు ఎమ్మెల్యే లను అసెంబ్లీ నుండి బహిష్కరించాలి.
నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని బెంగళూరు పోలీసులు తెలిపారు.
టీ.ఆర్.ఎస్ నేతలు ఇప్పటి వరకు ల్యాండ్, శాండ్ , వైన్ డీల్ చేసే నేతలు.. డ్రగ్స్ దందా లో కూడా వేలు పెట్టారు.
కర్ణాటక లో బీజేపీ తో మాట్లాడుకొని కేసును మాఫీ నీరుగార్చుతున్నారు.
టీ.ఆర్.ఎస్ , బీజేపీ ల మధ్య అండర్ స్టాండింగ్ ఉంది.
సాగర్ లో టీ.ఆర్.ఎస్ కు లబ్ది చేకూర్చడం కోసం బీజేపీ బలహీనమైన వ్యక్తి ని పెట్టింది.
సాగర్ లో ఓటర్లు టీ.ఆర్.ఎస్ కు బుద్ధి చెబితేనే టిఆర్ఎస్ కు బలుపు తగ్గుతుంది
కేసీఆర్.. జగన్ తో కుమ్మక్కై సంగమేశ్వర లిఫ్టు కు సహకరిస్తున్నడు.
రాయలసీమ కు నీళ్లు తరలిస్తే.. సాగర్ కు నీళ్లు రాకుండా పోతాయి. సాగర్ కు నీళ్లు రావు. ఎడారి గా మారుతుంది. ఓటర్లు గమనించాలి. టీ.ఆర్.ఎస్ ను చిత్తుగా ఓడించాలి.
కాళేశ్వరం ద్వారా రెండు టీఎంసీ కి లక్ష కోట్లు ఖర్చు చేశారు.
సాగర్ ఎన్నికల ను నిష్పక్షపాత జరిగే పరిస్థితి కనిపించడం లేదు.
డబ్బు, మద్యం ఆపాలని ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తిగా వైఫల్యం చెందింది.
పెద్ద పెద్ద మాటలు మాట్లాడే బండి సంజయ్ .. కర్ణాటక లో చీకటి ఒప్పందాలు ఎలా చేసుకుంటారు.
సాగర్ ఎన్నికల ప్రచారంలో 5 మంది కంటే ఎక్కువ ఉండవద్దని ఈసీ పేర్కొంది.