Crime సిటీలో ఎప్పుడు జనాలు రోడ్ల పైన తిరుగుతూనే ఉంటారు పగలు రాత్రి అని తేడా లేకుండా షికార్లు చేస్తూనే ఉంటారు ఏదో ఒక అవసరంతో రోడ్డు మీదకి రావాల్సి ఉంటుంది అది హైదరాబాద్ బెంగళూరు వంటి సిటీల్లో ఇంకా సాధారణంగా కనిపించే విషయం ఈ విషయాన్ని పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోరు అయితే తాజాగా బెంగళూరులో జరిగిన ఓ సంఘటన మాత్రం అందరినీ షాక్ కి గురిచేసింది..
బెంగళూరు నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం అక్కడ జనాలు పగలు రాత్రి అంతా లేకుండా తిరుగుతూనే ఉంటారు ముఖ్యంగా ఐటీ రంగానికి చెందిన వారు ఉండటం వల్ల షిఫ్ట్ అవసరంతో ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు అయితే పోలీసులు కూడా వీరు పర్యవేక్షణ చూడటానికి ఎప్పుడు కాపలాగా ఉంటారు అయితే రక్షించాల్సిన పోలీసులే అర్ధరాత్రి రోడ్లమీద తిరుగుతున్నారని శిక్షించిన సంఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది..
అర్ధరాత్రి రోడ్లమీద తిరుగుతున్నారని లేనిపోని చట్టాల పేరుతో అమానుషంగా ప్రవర్తించారు. రాత్రి వేళ బయట తిరుగుతున్నారన్న కారణంతో రూ.3 వేలు ఫైన్ వేశారు. రాత్రి సమయం కావడంతో బాధితులు వారి చెప్పినంత ఇచ్చుకోక తప్పలేదు. ఈ ఘటనను వివరిస్తూ బాధితుడు ట్విట్టర్ లో ట్వీట్ చేసి నగర కమిషనర్ కు ట్యాగ్ చేశారు. తన స్నేహితుడి బర్త్డే పార్టీకి వెళ్లి వస్తున్నానని రాత్రి అయినందువలన పోలీసులు తనతో 3000 ఫైన్ కట్టించుకున్నారని అయితే అర్ధరాత్రి కావడంతోనే మాట్లాడలేకపోయానని ఈ విషయం చాలా అమానుషమని ఎంత వాదించిందని ఆ వ్యక్తి ట్విట్టర్ వేదికగా తెలపడంతో ఈ విషయాన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది